రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాగా, ఫిబ్రవరి నెలలో స్వామి వారిని 1,97,860 మంది దర్శించుకున్నారు.
రామయ్యకు భక్తుల విరాళం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వివిధ కార్యక్రమాల నిమిత్తం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండయ్యపల్లికి చెందిన రెడ్ల కిషన్ – కల్పన దంపతులు రూ.2,00,232 విరాళాన్ని శనివారం అందజేశారు. ఆలయంలో జరిగే నిత్యాన్నదానానికి రూ.1,00,116, గోశాలలో ఏడాది పాటు ఆవుల పోషణకు రూ.1,00,116 వినియోగించాలని ఆలయ అధికారులను కోరారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకోగా, సిబ్బంది స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. ఆలయ పీఆర్వో సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : అన్నపురెడ్డిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయగా వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణ వేడుక కమనీయంగా సాగింది. వందల సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారి కల్యాణాన్ని వీక్షించి పులకించిపోయారు. కాగా, ఆలయ అధికారులకు భక్తులకు అన్నదానంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించారు.
యూడీఐడీ పోర్టల్‌పై
అవగాహన కల్పించాలి
చుంచుపల్లి: ప్రత్యేక వైకల్య గుర్తింపు (సదరం) కార్డు కోసం యూడీఐడీ(యూనిక్ డిజబిలిటీ ఐడీ) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా అవగాహన కల్పించాలని సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఆర్‌ఎంఓ రమేష్,సెర్ప్ సిబ్బంది యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ.. గతంలో సదరం ధ్రువీకరణ పత్రం కోసం మీసేవ, వీఎల్‌ఈ కేంద్రాలను ఆశ్రయించేవారని, ఇప్పుడు వీటితోపాటు యూడీఐడీ పోర్టల్, మొబైల్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ప్రక్రియను శనివారం నుంచి అమల్లోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.
10లోపు ఇందిరమ్మ లబ్ధిదారులకు మొదటి బిల్లు
నేలకొండపల్లి: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు మొదలుపెట్టాలని గృహ నిర్మాణ శాఖ ఖమ్మం పీడీ బి.శ్రీనివాస్ సూచించారు. మండలంలోని కొంగరలో లబ్ధిదారులతో శనివారం సమావేశమైన ఆయన.. ప్రభుత్వ సూచనల మేరకు 400 – 500చ.గజాల్లో ఇంటి నిర్మాణం చేపడితే ఇబ్బందులు ఉండవని తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించిన గ్రామాల లబ్ధిదారులు తొలుత ఇంటి నిర్మాణాలు ప్రారంభించాలని, వీరికి ఈనెల 10లోగా తొలి బిల్లు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
Comments
Please login to add a commentAdd a comment