చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లి రైల్వేస్టేషన్‌లో ఎరువుల దిగుమతి కోసం గూడ్స్ షెడ్ సిద్ధమైంది. దీంతో జిల్లాకు ఎరువుల రవాణా సులువు కానుంది. మూడో రైల్వే లైన్ ఏర్పాటుతో గత జనవరిలో ఖమ్మం రైల్వేస్టేషన్‌లో ఉన్న గూడ్స్ షెడ్‌ను తొలగించి పందిళ్లపల్లి స్టేషన్‌కు మార్చారు. కానీ సాంకేతిక కారణాలతో కొత్త గూడ్స్ షెడ్ ద్వారా ఎరువుల దిగుమతి మొదలుకాకపోవడంతో మిర్యాలగూడ, వరంగల్ రేక్ పాయింట్ల నుండి ఎరువులను తెప్పించి సొసైటీలు, ఆగ్రోస్ కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీ చేశారు. ఈక్రమంలో ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల రైతులకు ఇక్కట్లు ఎదురయ్యాయి. ఇంతలోనే ఇంటిగ్రేటెడ్ ఎరువుల నిర్వహణ వ్యవస్థ(ఐఎఫ్‌ఎంఎస్) ద్వారా పందిళ్లపల్లి షెడ్‌కు రైల్వే వ్యాగన్లలో ఎరువుల సరఫరాకు వివిధ కంపెనీలకు అనుమతి జారీ చేయడంతో సమస్య పరిష్కారమైనట్లయింది.
రంగంలోకి రెండు ప్రాంతాల కార్మికులు
పందిళపల్లి రైల్వేస్టేషన్ రేక్ పాయింట్ నుంచి ఎరువులను సరఫరా చేయడానికి లారీ యజమానుల అసోసియేషన్ బాధ్యులు ముందుకొచ్చి హ్యాండ్లింగ్ కాంట్రాక్టర్‌కు హామీ ఇవ్వడంతో ఆ సమస్య తీరింది. ఇదిలా ఉండగా పందిళ్లపల్లి గూడ్స్ షెడ్‌లో పనిచేసేందుకు పరిసర ప్రాంతాల కార్మికులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇక్కడ ఎగుమతి, దిగుమతులను తక్కువ ధరకే చేస్తామని కాంట్రాక్టర్‌కు హామీ పత్రం అందజేశారు. ఇంతలోనే ఖమ్మం గూడ్స్ షెడ్‌లో పనిచేసిన కార్మికులు సైతం తామే ఇక్కడ పనిచేస్తామని, కొత్తవారిని తీసుకోవద్దని కోరారు. ఈఅంశం రాజకీయ నాయకుల జోక్యంతో తీవ్రం కాగా వైరా పోలీస్ సర్కిల్ కార్యాలయానికి చేరింది. అఽధికారులు సమస్యను పరిష్కరిస్తే త్వరలోనే వ్యాగన్ల ద్వారా ఎరువుల దిగుమతి మొదలుకానుంది.
కార్మికుల సమస్య పరిష్కారమైతే
ఎరువుల దిగుమతి
Comments
Please login to add a commentAdd a comment