అనుచరుడి పాడె మోసిన మంత్రి తుమ్మల
సత్తుపల్లి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అనుచరుడు, మాజీ జెడ్పీటీసీ గాదె సత్యనారాయణ(79) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందగా శనివారం సత్తుపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించే సమయాన మంత్రి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు. నివాళులర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, కొండబాల కోటేశ్వరరావు, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, కూసంపూడి మహేష్, దొడ్డా శంకర్‌రావు, సాంబశివరావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment