పవిత్రమాసం.. రంజాన్
● నేటి నుంచి ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభం ● ఉపవాస దీక్షలు చేపట్టనున్న ముస్లింలు
ఉపవాసంతో ప్రయోజనాలు
ఉపవాసం ద్వారా మానసికంగా, శారీరకంగా, నైతికంగా, సామాజిక ప్రయోజనాలు కలుగుతాయి. సూర్యోదయం కంటే ముందు నుంచే సూర్యాస్తమయం వరకు దాదాపు 13 నుంచి 14 గంటలపాటు ధర్మసమ్మతమైన ఆహార పానీయాలను సైతం తీసుకోరు. యంత్రాలను సైతం కొంత సమయం తర్వాత ఎలా నిలుపుదల చేస్తామో ఆ విధంగా ఓ మనిషి పగటి వేళ ఆహార పానీయాలు తీసుకోకపోవడం వల్ల జీర్ణకోశం బలోపేతం అవుతుంది. ఉదరకోశానికి విశ్రాంతి నివ్వడం ద్వారా శరీరానికి అనారోగ్యం కలిగించే ఆమ్లాలు హరించుకుపోతాయి. జీర్ణశక్తి, రోగనిరోధక శక్తి పెరుగుతాయి. ఇదే అంశంపై సంస్కృతంలో సంకణం – దివ్యఔషధం ఇదే విషయాన్ని ఆయుర్వేదశాస్త్రం కూడా బలపరుస్తుంది.
నైతికత పెంపొందేలా..
మనసా వాచా కర్మేణా ఓ వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నపానీయాలను దూరంగా ఉంటూ చెడులకు, వ్యసనాలను సైతం అదుపులో ఉంచుకోవడమే నైతికత. తనకు తాను అదుపులో ఉంచుకుని రంజాన్ నెల మొత్తం ఉపవాసాలు ఉండే వ్యక్తికి ఈ నెల రాబోవు 11 నెలలకు శిక్షణ లాంటిది. అకలిదప్పుల బాధ తెలవడంతోపాటు పేదలకు ఆదుకునే తత్వం పెంపొందుతుంది. రంజాన్ నెలలో రూపాయి దానం చేస్తే అందుకు ఏడు వందల రెట్లు పుణ్యఫలం దక్కుతుందని పలువురు విశ్వసిస్తారు. ప్రతి మనిషిలో దానధర్మ గుణాలను ప్రోత్సహించడమే ఈ మాసపు లక్ష్యంగా చెప్పవచ్చు.
పవిత్రతకు ప్రతిరూపమైన రంజాన్ మాసం నేటి(ఆదివారం) నుంచి ప్రారంభం
కానుంది. చంద్రవంక కనిపించడంతో శనివారం రాత్రి ప్రత్యేక ప్రార్థన(తరాబీ)లు, నమాజ్‌లతో ముస్లింలు రంజాన్ మాసానికి స్వాగతం పలికారు. ప్రపంచ మానవాళికి మార్గదర్శకత్వం చూపే దివ్యఖురాన్ ఈ మాసంలోనే అవతరించిందని నమ్ముతారు. ఈ మాసంలో ప్రతి విశ్వాసి రోజా (ఉపవాసం) ఆచరిస్తారు. ఉపవాసం ముస్లింల విధిగా నిర్ణయించినట్లు దైవగ్రంథాలు చెబుతున్నాయి.
– చండ్రుగొండ
● చాంద్ ముబారక్
● కనిపించిన నెలవంక
అశ్వారావుపేటరూరల్: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. శనివారం సాయంత్రం ఆకాశంలో నెలవంక దర్శనమివ్వడంతో ముస్లింలంతా చాంద్ ముబారక్ అంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మసీదులు, ఇళ్ల వద్ద ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
పవిత్రమాసం.. రంజాన్
Comments
Please login to add a commentAdd a comment