రెచ్చిపోతున్న గంజాయి స్మగ్లర్లు | - | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న గంజాయి స్మగ్లర్లు

Published Mon, Mar 3 2025 12:22 AM | Last Updated on Mon, Mar 3 2025 12:22 AM

-

భద్రాచలం: భద్రాచలంలో రోజురోజుకూ గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. చెక్‌పోస్టు వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌కు వాహనంతో డాష్‌ ఇచ్చి పరారైన సంఘటన ఆదివారం జరిగింది. భద్రాచలం చెక్‌పోస్టు వద్ద పోలీసులు నిరంతరం గస్తీ, చెకింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్ల వారుజామున మూడు గంటలకు ఓ ద్విచక్రవాహనంపై అతివేగంతో ఇద్దరు యువకులు వెళ్తున్నారు. గమనించిన స్పెషల్‌ పార్టీ కానిస్టేబుల్‌ యోగానందాచారి వారిని ఆపేందుకు ప్రయత్నించారు. వారు ఆపకుండా కానిస్టేబుల్‌ను ఢీకొట్టి వెళ్లిపోయారు. తోటి సిబ్బంది కానిస్టేబుల్‌ను పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చేయి విరిగినట్లుగా వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్సకు ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. కాగా పది రోజుల క్రితం ఇదే చెక్‌పోస్టు వద్ద ఇదే తరహాలో ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై ఓ కానిస్టేబుల్‌ను ఢీ కొట్టి పరారైన విషయం విదితమే.

కానిస్టేబుల్‌ను బైక్‌తో ఢీకొట్టిపరారైన దుండగులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement