కారు, లారీ ఢీ
అశ్వారావుపేటరూరల్: కారును లారీ ఢీ కొట్టిన ఘటన ఆదివారం అశ్వారావుపేటలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. స్థానిక సాయిబాబా ఆలయం వద్ద డివైడర్ నుంచి యూ టర్న్ తీసుకుంటున్న కారును ఖమ్మం నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీ కొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జుకాగా, బెలూన్స్ తెరుచుకోవడంతో కారు నడుపుతున్న వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. కారు డ్రైవర్ జి. ఉమామహేశ్వరరావు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టీ.యయాతి రాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment