ఇల్లెందురూరల్: మండలంలోని పోలారం గ్రామపంచాయతీ భద్రుతండా గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మాణిక్యారం గ్రామపంచాయతీ దేశ్యాతండాకు చెందిన దంపతులు లక్ష్మ ణ్, మంజు బైక్‌పై స్వగ్రామం నుంచి మర్రిగూడెం వెళ్తున్నారు. అదే సమయంలో వేములవాడ గ్రామానికి చెందిన కుమార్ మర్రిగూడెం నుంచి ఇల్లెందు వైపు మరో బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఇల్లెందు ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో సతీష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం సిఫారసు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment