పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి ఆదివారం అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి వివిధ జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
రామయ్యను దర్శించుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే
దుమ్ముగూడెం : పర్ణశాల శ్రీ సీతారామచంద్రస్వామి వారిని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగ తం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వా త పంచవటీ కుటీరం, నారచీరల ప్రాంతాలను సందర్శించి వాటి విశిష్టతను అడిగి తెలుసుకున్నారు.
చోటేబాబాకు గౌరవ డాక్టరేట్
ఖమ్మం మామిళ్లగూడెం : ఖమ్మం నగరానికి చెందిన కాంగ్రెస్ మైనారిటీ విభాగం నాయకుడు షేక్ చోటేబాబా చేసిన సామాజిక సేవలను గుర్తించిన యూరోపియన్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఆదివారం ఢిల్లీలో యూరోపియన్, అమెరికన్ యూనివర్సిటీల ఆధ్వర్యంలో అంతర్జాతీయ సెమినార్ నిర్వహించారు. ప్రపంచంలోని పలు దేశాల్లో ఆయా రంగాల్లో సేవ చేసిన వారిని గుర్తించగా అందులో చోటేబాబాకు స్థానం దక్కడం విశేషం.
చిన్నారి చికిత్సకు ఆర్థిక సాయం
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఇటీవల ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న నాలుగేళ్ల చిన్నారి పాసి కృతిక చికిత్స నిమిత్తం రామవరం ఏరియా హనుమాన్ జిమ్, బ్లడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రూ.20 వేల ఆర్థికసాయం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె సాబీర్‌పాషా చేతుల మీదుగా చిన్నారి తండ్రి, ఆటో డ్రైవర్ కల్యాణ్ పాసికి నగదు అందజేశారు. చిన్నారి పూర్తిస్థాయి చికిత్స కోసం దాతలు ముందుకు రావాలని కోరారు. జిమ్ ఫౌండేషన్ సభ్యులు దాసు, సుధాకర్, లడ్డు, రాజేష్, సురేష్, దిలీప్, వసంత్, గుత్తుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
అలరించిన లఘుచిత్రాల ప్రదర్శన
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన లఘుచిత్రాల ప్రదర్శనలు అలరించాయి. దాశరధి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో రెండేళ్లుగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ లఘు చిత్రాలు ప్రదర్శిస్తుండగా ఆదివారం ఖమ్మంలో ఏర్పాటుచేశారు. సమాజ చైతన్యం కోసం రూపొందించిన చంద్రుడు, అంతరం, సాగరవాసి, శుభసంకల్పం, వాట్సాప్ స్టేటస్, జన్మనిచ్చిన తల్లికి, వలస గోస వంటి లఘుచిత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఫిలిం సొసైటీ అధ్యక్షుడు ఎస్.వినయ్‌కుమార్ మాట్లాడుతూ.. అభ్యుదయ భావాలను విస్తరించేందుకే ఇలాంటి చిత్రాలను ప్రదర్శిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఫిలిం సొసైటీ కార్యదర్శి బీడీఎల్ సత్యనారాయణ, మల్లం రమేష్, నెల నెలా వన్నెల నిర్వాహకులు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
Comments
Please login to add a commentAdd a comment