రిటైర్డ్ ఎస్సై ఆత్మహత్య
బూడిదగడ్డ ఏరియాలో మరొకరు..
కొత్తగూడెంఅర్బన్: పట్టణంలోని బూడిదగడ్డ ఏరియాలో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. త్రీటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. బూడిదగడ్డ ఏరియాకు చెందిన పుట్టా రంజిత్(30) సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యులు వేరే ఊరికి వెళ్లడంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. త్రీటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, కుటుంబ సభ్యులు వచ్చాక ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
కొత్తగూడెంఅర్బన్: రిటైర్డ్ ఎస్‌ఐ ఒకరు ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మీదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి కథనం ప్రకారం.. కొత్తగూడెం త్రీటౌన్‌లో పని చేసిన ఎస్సై ఖాజా మొహినుద్దీన్ (65) గతేడాది ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఎదురుగడ్డ గ్రామంలో కుటుంబంతో నివాసముంటున్నాడు. ఇటీవల తన భార్య అనారోగ్యంగా ఉండటం, పిల్లలు ఇంకా సెటిల్ కాకపోవడంతో మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్ర మంలో ఆదివారం ఇంట్లోనే చీరతో ఉరేసుకుని మృతి చెండు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు. కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఐ శ్రీనివాసరావు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రిటైర్డ్ ఎస్సై ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment