పాల్వంచ: మూడు రోజుల క్రితం ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్ భార్య స్నానం చేస్తుండగా అదే అపార్ట్‌మెంట్‌లో ఉండే కేటీపీఎస్ ఉద్యోగి ఫొటోలు తీశాడని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని కొమ్ముగూడెంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దివ్యాంగుడైన వ్యక్తి వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. భార్య, కుమారుడితో కలిసి అపార్ట్‌మెంట్‌లోనే ఓ గదిలో నివాసముంటున్నాడు. కాగా అతని భార్య బాత్రూంలో స్నానం చేస్తుండగా అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే కేటీపీఎస్ ఉద్యోగి మద్యం తాగి వచ్చి వెంటిలెటర్ నుంచి సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీశాడు. దీంతో గుర్తించిన మహిళ ఆందోళనకు గురై ప్రశ్నించడంతో గొడవ జరిగింది. బయటకు వెళ్లిన భర్త, కుమారుడు ఇంటికి వచ్చాక సదరు కేటీపీఎస్ ఉద్యోగిని ప్రశ్నించగా.. వారిపైనే తిరిగి దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధిత మహిళ పోలీసులకు, కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. కాగా ఫొటోలు తీసిన వ్యక్తి గతంలో సైతం అదే తరహాలో వ్యవహరించినట్లు సమాచారం. దివ్యాంగుడి కంటే ముందు అపార్ట్‌మెంట్‌లో పనిచేసే వాచ్‌మన్ భార్యపట్ల కూడా అదే తీరులో వ్యవహరించినట్లు, అపార్ట్‌మెంట్‌లో ఉండే వారితో గొడవలు పడిన సంఘటనలు ఉన్నట్లు తెలుస్తోంది. కేటీపీఎస్‌లో మహిళా ఉద్యోగులతో అసభ్యకరంగా వ్యవహరించి సస్పెన్షన్‌కు గురయ్యాడని సమాచారం. ఈ విషయమై ఎస్‌ఐ రాఘవయ్యను వివరణ కోరగా... ఫిర్యాదు వచ్చిందని, అనంతరం వారు మళ్లీ మాట్లాడుకుంటామని వెళ్లిపోయారని తెలిపారు.
మహిళ స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీసిన కేటీపీఎస్ ఉద్యోగి?
Comments
Please login to add a commentAdd a comment