దివ్యకారుణ్య తత్వాన్ని పెంపొందించుకోవాలి
ఖమ్మం రూరల్: సమాజంలో ప్రతి ఒక్కరూ దివ్య కారుణ్య తత్వాన్ని పెంపొందించుకోవాలని కర్నూల్ బిషప్ జ్యానేష్ పిలుపునిచ్చారు. ఖమ్మం మేత్రాసనం బిషన్ డాక్టర్ సగిలి ప్రకాష్ సారథ్యంలో కరుణగిరి ప్రాంగణంలో పుణ్యక్షేత్ర యాత్ర మహాత్సవం ముగింపు వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనుషులంతా తోటి వారి పట్ల కరుణ, శాంతితో మెలగాలని కోరారు. ఏసుప్రభు చూపిన మార్గం అందరినీ విశిష్ట మానవులుగా తీర్చిదిద్దుతుందన్నారు. బిషన్ డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ.. లోక రక్షకుని బోధనలతో నవ వసంతం నిండుతుందన్నారు. ఈ ఉత్సవాల్లో విశ్వాసంతో పాటు ఆధ్యాత్మిక భావన వెల్లివిరిసిందని చెప్పారు. ముగింపు వేడుకల సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. విజేతలకు బహుమతి ప్రదానంతో పాటు బిషప్‌లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఫాదర్ మ్యాత్యూవరప్రసాద్ రాజు, వీజే శౌరి, సూరేపల్లి ఐజాక్, చాన్సలర్ జర్నీస్ తదితరులు పాల్గొన్నారు.
కర్నూల్ బిషప్ జ్యానేష్
Comments
Please login to add a commentAdd a comment