ఓసీలో కాలిపోతున్న బొగ్గు
మణుగూరు టౌన్: సింగరేణి మణుగూరు ఓపెన్‌కాస్టులో బొగ్గు రాశులు తగలబడుతున్నాయి. ఎంతో కష్టపడి తీసిన, విలువైన బొగ్గు కళ్ల ముందే కాలిపోతోందంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండ తీవ్రత పెరుగుతుండటంతో స్టాక్ యార్డ్ వద్ద ఉంచిన బొగ్గు కాలి దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి. అధికారులు మంటలను నిరోధించే చర్యలు తీసుకోకపోవడంతో పొగతో కార్మికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కార్మికుల శ్రమ, యంత్రాలను వినియోగించి వెలికితీసిన బొగ్గు మండిపోవడంతో సింగరేణి సంస్థకు సైతం నష్టం వాటిల్లుతోంది. సింగరేణి యాజమాన్యం ప్రణాళిక రూపొందించి వార్షిక లక్ష్య సాధనకు ప్రయత్నిస్తుండగా మణుగూరు ఓసీ అధికారుల తీరుతో ఆ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి బొగ్గు రాశులను తరచూ నీటి ద్వారా తడుపుతూ మంటలను నిరోధించాలని, కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు.
అధికారుల ప్రణాళిక లోపంతో సంస్థకు నష్టం
Comments
Please login to add a commentAdd a comment