శ్రీరామనవమి ఏర్పాట్లపై నేడు సమీక్ష | - | Sakshi
Sakshi News home page

శ్రీరామనవమి ఏర్పాట్లపై నేడు సమీక్ష

Published Thu, Mar 6 2025 12:32 AM | Last Updated on Thu, Mar 6 2025 12:31 AM

శ్రీరామనవమి ఏర్పాట్లపై నేడు సమీక్ష

శ్రీరామనవమి ఏర్పాట్లపై నేడు సమీక్ష

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): శ్రీరామనవమి, పట్టాభిషేకం వేడుకల ఏర్పాట్లపై గురువారం ఉదయం 11 గంటలకు భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి అన్ని రకాల వసతి, సౌకర్యాల కల్పనకు సమగ్ర సమాచారంతో సమావేశానికి రావాలని జిల్లా అధికారులను ఆయన ఆదేశించారు.

జాతీయ పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు అభినందన

కొత్తగూడెంటౌన్‌: ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు గుంటూరులో జరగనున్న ఆర్చరీ నేషనల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపికై న క్రీడాకారులను కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అభినందించారు. పోటీలకు ఎంపికై న ఎం.విక్రమ్‌ (కొత్తగూడెం), పి.హరీష్‌(పాల్వంచ), క్రాంతి వర్మ(సుజాతనగర్‌) ఐడీఓసీలో బుధవారం కలెక్టర్‌ను కలిశారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ పి.పరంధామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement