సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
ఎస్పీ రోహిత్‌రాజ్
బూర్గంపాడు: సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్పీ రోహిత్‌రాజ్ అన్నారు. బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని, వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు, సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సైబర్ నేరాలు నానాటికీ పెరుగుతున్నందున ప్రజల్లో విస్తృతంగా చైతన్యం తీసుకురావాలని, నేరాల తీరును వారికి అర్థమయ్యేలా అవగాహన కల్పించాలని అన్నారు. అప్పనంగా డబ్బు వస్తుందనే ఆశతో సెల్‌ఫోన్‌లోని యాప్‌లు, లింక్‌లను క్లిక్ చేయవద్దని ప్రజలకు సూచించారు. ఆయన వెంట సీఐ నాగరాజు(స్పెషల్ బ్రాంచ్), ఎస్‌ఐలు రాజేష్, నాగభిక్షం తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment