ప్రశాంతంగా ఇంటర్ ‘ద్వితీయ’ పరీక్షలు
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని 36 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 9,030 మంది విద్యార్థులకు గాను 8,759 మంది పరీక్ష రాయగా, 271 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టిస్ ఘటనలు చోటుచేసుకోకుండా సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, విద్యార్థులకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే తక్షణ చికిత్స కోసం వైద్యారోగ్య సిబ్బందితో పాటు మందులు అందుబాటులో ఉంచారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పటిష్ట పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
9,030 మందికి
8,759 విద్యార్థుల హాజరు
Comments
Please login to add a commentAdd a comment