సుమనోహరం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం సుమనోహరంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రామయ్య సన్నిధిలో ఖమ్మం జిల్లా జడ్జి..
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారిని ఖమ్మం జిల్లా జడ్జి రాజగోపాల్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. వీరికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా అంతరాలయంలో మూలమూర్తులకు పూజలు చేశాక పండితులు వేదాశీర్వచనం, ప్రసాదాలను అందజేశారు. భద్రాచలం పస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ శివ నాయక్, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment