భధ్రాచలం: ట్రైకార్, ఎంఎస్‌ఎంఈ యూనిట్ల లబ్ధిదారుల రుణాల మంజూరు ను వేగవంతం చేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ బ్యాంకర్లకు సూచించారు. తన చాంబర్‌లో గురువారం ఆయన బ్యాంక్ అఽధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రౌండ్ చేసిన 70 ట్రైకార్ యూనిట్లు ఈనెల 31 నాటికి లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. ఎంఎస్‌ఎంఈ పథకం కింద లబ్ధిదారులకు మంజూరైన యూనిట్లలో కొన్ని పలు కారణాలతో నిలిచిపోయాయని, అర్హులైన వారికి మంజూరు చేసేలా చూడాలని కోరారు. సమావేశంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, ఏడీ భాస్కరన్, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్‌రెడ్డి, జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment