సీతారామ కాల్వ కళకళ..
జూలూరుపాడు: మండలంలోని వినోభానగర్ వద్ద గల సీతారామ ప్రాజెక్ట్ కాల్వ గోదావరి జలాలతో కళకళలాడుతోంది. సీతారామ కెనాల్ ద్వారా ఏన్కూర్ వద్ద రాజీవ్ లింక్ కెనాల్‌లోకి నీటిని మళ్లించిన విషయం తెలిసిందే. సీతారామ ప్రాజెక్ట్ పనులు చేపట్టిన తొమ్మిదేళ్లకు గోదావరి జలాలు కెనాల్‌లో ప్రవహించడంతో ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏన్కూర్ రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణానికి ప్రస్తుత ప్రభుత్వం రూ.96 కోట్లు మంజూరు చేయగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎట్టకేలకు పనులు పూర్తి కావడంతో అశ్వాపురం మండలం బీజీకొత్తూరు, ములకలపల్లి మండలం కమలాపురం పంప్‌హౌస్‌ల ద్వారా జూలూరుపాడు మండలం వినోభానగర్‌కు నీరు చేరుకుంది. అక్కడి నుంచి ఏన్కూరులోని ఎన్నెస్పీ కెనాల్ వద్ద గోదావరి, కృష్ణా జలాలు అనుసంధానం అయ్యాయి.
దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద తగ్గుతున్న గోదావరి
అశ్వాపురం: మండల పరిధిలోని కుమ్మరిగూడెం గ్రామంలో దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద గోదావరి నీటి మట్టం తగ్గుతోంది. గత మూడు రోజులుగా సీతారామ ప్రాజెక్ట్ ఫేస్–1 పంప్‌హౌస్ ద్వారా నీరు ఎత్తిపోసి దిగువకు వదలగా, ఎన్నెస్పీ కెనాల్‌కు చేరింది. దీంతో పాటు జిల్లా మొత్తానికి మిషన్ భగీరథ నీరు, భారజల కర్మాగారం, బీటీపీఎస్, సింగరేణి, దుమ్ముగూడెం హైడల్ ప్రాజెక్ట్, ఐటీసీ పీఎస్‌పీడీకి సైతం ఇక్కడి నీటినే వినియోగిస్తారు. మూడు రోజుల క్రితం 49.6 మీటర్ల నీటి మట్టంతో ఆనకట్టపై నీరు పొంగి ప్రవహించగా గురువారం 49.2 మీటర్లకు తగ్గింది. వచ్చేది వేసవి కాలం కావడంతో నీరు భారీగా తగ్గితే తాగునీరు, పరిశ్రమలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఎన్నెస్పీ కెనాల్‌కు మరో రెండు రోజుల పాటు నీరు ఎత్తిపోస్తే ఇక్కడ మరింతగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.
సీతారామ కాల్వ కళకళ..
Comments
Please login to add a commentAdd a comment