రామయ్య సన్నిధిలో ఐఏఎస్ వివాహం
భద్రాచలంఅర్బన్: భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఓ ఐఏఎస్ అధికారి వివాహం చేసుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన స్నేహ ప్రస్తుతం ఒడిశా కేడర్‌లో అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెకు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి అఖిల్‌రెడ్డితో వివాహం నిశ్చయం కాగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన మారుతీ సదనంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గురువారం వీరి వివాహం వైభవంగా సాగగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్, ఐటీడీఏ పీఓ బి.రాహూల్, భద్రాచలం ప్రథమ శ్రేణి న్యాయమూర్తి శివనాయక్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment