వేసవిలోనూ నిరంతర విద్యుత్
భద్రాచలంఅర్బన్: వేసవిలోనూ నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ పనిచేస్తుందని జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ) మహేందర్ అన్నారు. ఎండ వేడికి విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుందనే ముందస్తు ఆలోచనతో భద్రాచలం పట్టణంలో రూ.1.50 కోట్లతో వివిధ కాలనీల్లో 28 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. వాటిలో గురువారం 12 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఎస్‌ఈ మహేందర్ ప్రారంభించి, మాట్లాడారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఇప్పటికే జిల్లావ్యాప్తంగా వేసవిలో విద్యుత్ సమస్యలు తలెత్తే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేసవిలో మెరుగైన, నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా లోఓల్టేజీ సమస్యలు ఉంటే వెంటనే స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు తెలపాలని, వారు సమస్యను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొస్తారని తెలిపారు. కార్యక్రమంలో భద్రాచలం విద్యుత్ డీఈ జీవన్‌కుమార్, ఏడీఈ వేణు, ఏఈ రాజారావు, లైన్‌మెన్ త్రినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వేసవిలోనూ నిరంతర విద్యుత్
Comments
Please login to add a commentAdd a comment