యువకుడిపై దాడి..
దమ్మపేట: వివాహేతర సంబంధం నెపంతో ఓ యువకుడిపై మరో వ్యక్తి ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన మండలంలోని గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పట్వారిగూడెం గ్రామానికి చెందిన సున్నం శివ (28) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఆర్లపెంటలోని డబుల్ బెడ్రూం సముదాయం వద్దకు తన మిత్రుడిని కలవాలని వెళ్లాడు. అక్కడ శివను అదే గ్రామానికి చెందిన వగ్గెల శ్రీను అసభ్య పదజాలంతో దూషించాడు. తన భార్యను కలిసేందుకు వచ్చావని పేర్కొంటూ ఇనుప రాడ్డుతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శివను స్థానికులు లంకాలపల్లి వద్దకు తీసుకురాగా.. శివ బంధువు అనుదీప్ అక్కడి నుంచి పట్వారిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. కుటుంబ సభ్యులు క్షతగాత్రుడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి సోదరి రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాయికిశోర్‌రెడ్డి తెలిపారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
Comments
Please login to add a commentAdd a comment