అడవిలో చెలరేగిన మంటలు
అశ్వాపురం: మండలంలోని మొండికుంట సమీపంలో పెద్దగుట్టపై అడవిలో గురువారం రాత్రి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
బొలేరో, ఆటో ఢీ
జూలూరుపాడు: మండలంలోని మాచినేనిపేటతండాలో తల్లాడ – కొత్తగూడెం ప్రధాన రహదారిపై ఆటో, బొలేరో ఢీకొన్న ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఆటో, బొలేరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో బొలేరో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. పడమటనర్సాపురానికి చెందిన ఆటోడ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో ముందు భాగం దెబ్బతిన్నది. బొలేరో వాహనం డ్రైవర్, ఆటోడ్రైవర్ ఇద్దరూ స్నేహితులని తెలిసింది. పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
బాలిక కిడ్నాప్ కేసులో అరెస్ట్
పాల్వంచ: బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై రాఘవయ్య తెలిపారు. పట్టణంలోని ఓ బాలిక (17)ను పాత సురారం గ్రామానికి చెందిన లకావత్ ప్రవీణ్ మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడు. కాగా బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈనెల 3న కేసు నమోదు చేశామని, గురువారం అరెస్ట్ చేశామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment