పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. ఆ తర్వాత నివేదన, హారతి, మంత్రపుష్పం తదితర పూజలు జరిపారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, వేద పడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్ కానుకలకు క్యూఆర్ కోడ్
పాల్వంచరూరల్ : పెద్దమ్మతల్లికి కానుకలు సమర్పించే భక్తులకు ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు ఎస్‌బీఐ అధికారులు ఆలయంలో గురువారం క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. భక్తులు సెల్‌ఫోన్లతో స్కాన్ చేసి కానుకలు చెల్లించేలా వెసులుబాటు కల్పించినట్లు ఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ వరంగల్ డీజీఎం ఘన్‌శ్యామ్ సోలంకీ, రీజినల్ మేనేజర్ ఎం.సత్యనారాయణ, పాల్వంచ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ఎ.బంగారయ్య పాల్గొన్నారు. కాగా, ఈనెల 10వ తేదీన హుండీల్లోని కానుకలు లెక్కించనున్నట్లు ఈఓ మరో ప్రకటనలో తెలిపారు.
మణుగూరు
కోర్టుకు జిల్లా జడ్జి
సదుపాయాలు, వసతులపై ఆరా..
మణుగూరు టౌన్: మణుగూరు జ్యుడీషియల్ ప్రథమశ్రేణి కోర్టును జిల్లా జడ్జి పాటిల్ వసంత్ గురువారం సందర్శించారు. కోర్టులో అవసరమైన గదులు, తాగునీటి వసతి తదితర సదుపాయాలపై చర్చించారు. కోర్టుకు గేట్ ఏర్పాటుచేయాలని, రోడ్డు సౌకర్యం కల్పించాలని స్థానిక న్యాయవాదులు జడ్జిని కోరగా నిధుల మంజూరుకు హైకోర్టుకు నివేదిస్తామని చెప్పారు. కార్యక్రమంలో న్యాయవాదులు మేదరమెట్ల శ్రీనివాస్, కిషన్‌రావు, కందిమళ్ల నర్సింహారావు, కవిత, వాసవి, సర్వేశ్వరరావు, నగేశ్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
దమ్మపేట మెజిస్ట్రేట్‌గా భవాని
దమ్మపేట/ కొత్తగూడెంటౌన్: దమ్మపేట కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌గా బి.భవాని గురువారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆమె కొత్తగూడెం కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
సిగరేణి భవన్‌లో
నేడు స్ట్రక్చర్ సమావేశం
హాజరుకానున్న సీఎండీ, డైరెక్టర్లు
సింగరేణి(కొత్తగూడెం) : హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో ఆరేళ్ల తర్వాత శుక్రవారం స్ట్రక్చర్ సమావేశం నిర్వహిస్తున్నారు. సీఎండీ బలరామ్, ఇద్దరు డైరెక్టర్లు, 11 మంది గుర్తింపు సంఘం ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. వాస్తవానికి ముగ్గురు డైరెక్టర్లు రావాల్సి ఉన్నా.. ప్రస్తుతం డైరెక్టర్(పా) పోస్ట ఖాళీగా ఉండడంతో ఇద్దరే హాజరవుతున్నారు. కార్మికుల సొంతింటి కల నిజం చేయాలని, ప్రతీ కార్మికుడికి 250 గజాల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి వడ్డీ లేకుండా రూ.30 లక్షల రుణం ఇవ్వాలని, కార్మికులు అనారోగ్యానికి గురైతే ఆస్పత్రి ఖర్చంతా యాజమాన్యమే భరించాలని, ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు సైతం ఉచితంగా వైద్య సేవలందిచాలని, సింగరేణి వ్యాప్తంగా పనిచేసే కార్మికులకు విశ్రాంతి షెల్టర్లు ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో గుర్తింపు సంఘం నాయకులు కోరనున్నారు.
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
Comments
Please login to add a commentAdd a comment