తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని ఎస్‌ఆర్‌ఎన్‌కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. కాలనీవాసి వెంకటేశ్వరరావు భార్యతో కలిసి విజయవాడ వెళ్లాడు. బుధవారం అర్ధరాత్రి తాళం పగలగొట్టిన దుండగుడు లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇంటి పక్కనే ఉండే వెంకటేశ్వరరావు కుమారుడు వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించారు. టౌన్ పోలీసులు క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. కాగా, దుండగుడు తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించినట్లు సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది.
ఇసుక టిప్పర్ సీజ్
దమ్మపేట: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్‌ను గురువారం పోలీసులు సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని రాజమండ్రి నుంచి మండలంలోని పట్వారిగూడెంనకు ఇసుకను టిప్పర్‌లో తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతి పత్రాలు లేకపోవడంతో లారీని సీజ్ చేసి, కేసు నమోదు చేశామని ఎస్‌ఐ సాయికిశోర్‌రెడ్డి తెలిపారు.
చిన్ననల్లబల్లిలో ట్రాక్టర్..
దుమ్ముగూడెం: మండలంలోని చిన్ననల్లబల్లి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకుని కేసు నమోదు చేశామని ఎస్‌ఐ గణేశ్ గురువారం తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ కృష్ణయ్య సిబ్బందితో కలిసి చిన్ననల్లబెల్లి గ్రామంలో ప్రధాన రహదారిపై వాహన తనిఖీలు చేస్తున్నారు. అటువైపు నుంచి వచ్చిన ఓ ట్రాక్టర్‌ణు ఆపేందుకు యత్నించగా డ్రైవర్ పోలీసులను గమనించి పారిపోయే ప్రయత్నం చేశాడు. పోలీసులు అప్రమత్తమై ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. చర్ల మండలం ఆర్.కొత్తగూడెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ఏనూటి రమేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment