యువకుడి ఆత్మహత్య
ఇల్లెందురూరల్: మండలంలోని రేపల్లెవాడ గ్రామ పంచాయతీ నిజాంపేటకు చెందిన వర్స సాగర్ (30) గురువారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. టేకులపల్లి మండలానికి చెందిన యువతితో సాగర్‌కు రెండు నెలల కిందట వివాహమైంది. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంటివద్ద ఒంటరిగా ఉన్న సాగర్ ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. పొలం పనులు ముగించుకొని ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఇంట్లో వేలాడుతున్న సాగర్‌ను చూసి కిందకు దించారు. అప్పటికే సాగర్ మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న సీఐ బత్తుల సత్యనారాయణ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment