వేసవిలో బాక్సింగ్ ఉచిత శిక్షణ
కొత్తగూడెంఅర్బన్: గ్రామీణ యువతీ యువకులు బాక్సింగ్‌పై అవగాహన లేక నేర్చుకోలేకపోతున్నారని, వారందరికి కూడా అవగాహన కల్పిస్తామని బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ లగడపాటి రమేశ్, చీఫ్ పాట్రన్ ఎర్రా కామేశ్ తెలిపారు. గురువారం కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. బాక్సింగ్‌పై ఆసక్తి కలిగిన యువతీ యువకులకు రానున్న వేసవిలో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని, క్రీడా సామగ్రిని ఉచితంగానే అందిస్తామన్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే అసోసియేషన్ లక్ష్యమని పేర్కొన్నారు. వేసవిలో ఎన్‌ఐఎస్ శిక్షణ పొందిన ఈశ్వర్, జాతీయస్థాయి బాక్సింగ్‌లో బంగారు పతకం సాధించిన శివసుబ్రహ్మణ్యం శిక్షకులుగా వ్యవహరిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ నూతన చైర్మన్‌గా లగడపాటి రమేశ్, అధ్యక్షులుగా ఉదయ్‌కాంత్, కార్య నిర్వాహక అధ్యక్షులుగా ఎం.రాజయ్య, ప్రధాన కార్యదర్శిగా వై.శివసుబ్రహ్మణ్యం, ముఖ్య సలహాదారులుగా జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కె.సంజీవరావు, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సంగం వెంకటపుల్లయ్య, టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షులు అమరనేని రామారావు, ఎల్టా జిల్లా అధ్యక్షులు దస్తగిరి, చీఫ్ పాట్రన్‌గా న్యాయవాది ఎర్రా కామేశ్, జవహర్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా షమీఉద్దీన్‌తో పాటుగా ఆర్గనైజింగ్ సెక్రటరీ, జాయింట్ సెక్రెటరీ, మిగతా సభ్యులను ఎన్నుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment