గద్దైపెకి ఇలవేల్పులు..
గుండాల: గద్దెలపైకి ఇలవేల్పులు చేరడంతో మండలంలోని యాపలగడ్డలో నిర్వహిస్తున్న జాతర పూరిపూర్ణత సంతరించుకుంది. ఈ సందర్భంగా డోలి చప్పుళ్లు, గజ్జెల మోత, మహిళల పూనకాలు, యువత చిందులతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. గురువారం పగిడిద్దరాజు, సమ్మక్క (వనం) గద్దైపెకి రావడంతో భక్తులు మొక్కులు చెల్లించుకుకన్నారు. వన దేవతలను తీసుకొచ్చే దారిపొడవునా భక్తుల జయజయధ్వానాలతో హోరెత్తింది. వడ్డెలు, పూజారులు చిలకల గుట్ట నుంచి వనాన్ని తీసుకొచ్చి గద్దైపె ప్రతిష్ఠించారు. అరెం వంశీయులు పూజలతో వన దేవతలను స్వాగతించారు. పగిడిద్దరాజు – సమ్మక్కకు ఎదురిళ్లు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. నాలుగు గంటలకు జోగు నిర్వహించి, రాత్రి 8 గంటలకు దేవతలకు గంగాస్థానం చేయించి ఒడి నింపారు. సమ్మక్క – పగిడిద్దరాజులకు నాగవెళ్లి నిర్వహించారు. డోలీలు, డప్పులతో గద్దెల వద్దకు భారీ సంఖ్యలో భక్తులు, మహిళలు పూనకాలతో తరలివచ్చారు. దేవతలను తాకేందుకు భక్తులు పోటీపడ్డారు. కాగా, జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గుండాల సీఐ రవీందర్, ఎస్‌ఐ రాజమౌళి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో పూజారులు అర్రెం అప్పయ్య, లక్ష్మీనర్సు, కాంతారావు, పెద్దకాంతారావు, నాగేశ్వరరావు, భిక్షం, లక్ష్మీనారాయణ, లచ్చుదొర, మానాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
జనసంద్రమైన యాపలగడ్డ
ఘనంగా పగిడిద్దరాజు – సమ్మక్క నాగబెల్లి
గద్దైపెకి ఇలవేల్పులు..
Comments
Please login to add a commentAdd a comment