
వివరాలు సేకరించిన నిపుణులు
ఆన్‌లైన్ విధానంలో మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి–కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, విద్యాశాఖ కమిషనర్ నరసింహారెడ్డి, కలెక్టర్ జితేష్ వి.పాటిల్‌తో చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆన్‌లైన్ విభాగ నిపుణుడు ప్రశాంత్‌రెడ్డి గత గురువారం కొత్తగూడెంలో పర్యటించి కావాల్సిన సమాచారాన్ని సేకరించారు. డీఈఓ వెంకటేశ్వరాచారి, కొత్తగూడెం ఎంఈఓ ప్రభుదయాల్ నుంచి పూర్తి వివరాలు సేకరించారు. నెల పూర్తికాగానే బిల్లులు జనరేట్ అవుతూ ఏకకాలంలో చెల్లింపులు జరిగేలా మార్పులు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment