సూపర్‌బజార్(కొత్తగూడెం): పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలకు ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీక అని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లోని ముస్లిం ఉద్యోగులకు నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తారని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో సోదర భావాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యోగులు కలెక్టర్‌కు ఖురాన్‌ను బహూకరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, సీపీఓ సంజీవరావు, డీపీఆర్‌ఓ అజ్గర్‌హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్