ఆస్తిపన్ను వసూళ్లలో సత్తుపల్లి భేష్‌ | - | Sakshi
Sakshi News home page

ఆస్తిపన్ను వసూళ్లలో సత్తుపల్లి భేష్‌

Published Wed, Apr 2 2025 12:48 AM | Last Updated on Wed, Apr 2 2025 12:48 AM

ఆస్తి

ఆస్తిపన్ను వసూళ్లలో సత్తుపల్లి భేష్‌

సత్తుపల్లిటౌన్‌: 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను వసూళ్ల గడువు సోమవారంతో ముగిసింది. ఈనేపథ్యాన ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో పరిశీలిస్తే సత్తుపల్లి ముందంజలో నిలిచింది. చివరిరోజు వరకు మున్సిపాలిటీ మేనేజర్‌ సహా రెవెన్యూ యంత్రాంగమంతా పన్ను వసూళ్లలో నిమగ్నం కావడం.. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఆరు రోజుల ముందు ప్రభుత్వం వన్‌ టైం సెటిల్‌మెంట్‌ పథకం ద్వారా పన్ను వడ్డీపై 90 శాతం రాయితీని ప్రకటించడంతో బకాయిదారులకు మెరుగైన వసూళ్లు నమోదయ్యాయి. అంతేకాక ఆస్తి పన్ను చెల్లించకుండా మొండికేసిన వారికి జప్తు నోటీసులు జారీ చేయడం.. నల్లా కనెక్షన్లు తొలగిస్తామన్న హెచ్చరికలతో చాలా మంది మొండి బకాయిదారులు సైతం పన్ను చెల్లించారు.

వసూళ్లు ఇలా...

ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో పరిశీలిస్తే సత్తుపల్లిలో రూ.4.91 కోట్లకు రూ.4.26 కోట్లు, వైరాలో రూ.4.06 కోట్లకు రూ.2.13 కోట్లు, మధిరలో రూ.2.56 కోట్లకు రూ.1.96 కోట్లు వసూలైంది. కొత్తగూడెం మున్సిపాలిటీలో రూ.7.93 కోట్లకు రూ.5.86 కోట్లు, మణుగూరులో రూ.2.42 కోట్లకు రూ.1.50 కోట్లు, పాల్వంచలో రూ.6.29 కోట్లకు రూ.4.13 కోట్లు, ఇల్లెందులో రూ.2.67 కోట్ల పన్ను డిమాండ్‌కు గాను రూ.2.20 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేయగలిగారు.

గత ఏడాదితో పోలిస్తే మెరుగు

సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో 85 శాతం పన్నులు వసూలయ్యాయి. అయితే, 2024–25లో 86.76 శాతం వసూలవడంతో గత ఏడాది కంటే మెరుగైంది. పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని చేరుకునేలా నెల ముందు నుంచే స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. మున్సిపల్‌ కమిషనర్‌ కె.నర్సింహ రోజువారి సమీక్షలు చేస్తూ.. మొండిబకాయిదారులతో మాట్లాడడంతో సత్ఫలితాలు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో 86.76 శాతంతో సత్తుపల్లి ముందంజలో నిలువగా.. వైరా మున్సిపాలిటీలో కేవలం 52.46 శాతమే వసూలు కాగా చివరి స్థానంలో నిలిచింది.

మున్సిపాలిటీ ఆస్తి పన్ను

వసూళ్లు (శాతం)

సత్తుపల్లి 86.76

ఇల్లెందు 82.40

మధిర 75

కొత్తగూడెం 73.90

పాల్వంచ 65.66

మణుగూరు 61.98

వైరా 52.46

ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో ముందంజ

ఆ తర్వాత స్థానంలో ఇల్లెందు

కేవలం 52శాతంతో

జాబితాలో చివరన వైరా

ఆస్తిపన్ను వసూళ్లలో సత్తుపల్లి భేష్‌1
1/1

ఆస్తిపన్ను వసూళ్లలో సత్తుపల్లి భేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement