
చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్
ఖమ్మంక్రైం: జల్సాలకు అలవాటు పడి ఇళ్లలో, బైక్‌లను చోరీ చేస్తున్న వ్యక్తిని ఖమ్మం వన్‌టౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సీఐ ఉదయ్‌కుమార్ కథనం ప్రకారం.. భద్రాచలానికి చెందిన కోడి శేఖర్ అలియాస్ జంపన్న ఖమ్మం వన్ టౌన్, టూ టౌన్, ఖానాపురం హవేలీ పోలీస్‌స్టేషన్ల పరిధిలో మరో వ్యక్తితో కలిసి చోరీలకు పాల్పడుతున్నాడు. దీంతో నిఘా పెట్టిన పోలీసులకు వెలుగుమట్ల సమీపంలోని పంచాక్షరి కాలనీలో ఉన్నట్లు సమాచారం అందడంతో వెళ్లి శేఖర్‌ను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పారిపోయాడు. నాలుగు బైకులు, 10 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడి అరెస్ట్‌లో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు హరికృష్ణ, బోరయ్యను సీపీ సునీల్‌దత్, ఏసీపీ రమణమూర్తి అభినందించారు.