కొత్తగూడెంటౌన్: బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ రోహిత్‌రాజు పేర్కొన్నారు. శనివారం జిల్లావ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలోని బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బందితో ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లపై సంచరిస్తూ, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. డయల్–100కు ఫోన్ రాగానే వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవాలని, బాధితులకు న్యాయం చేయడంతో బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్, ఐటీ సెల్ ఇన్‌చార్జ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.