ఇల్లెందురూరల్: మండలంలోని రాజీవ్‌నగర్‌తండా సమీపంలోని జెండాలవాగు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వాంకుడోత్ కిషన్ (50) మృతి చెందాడు. మృతుని బంధువుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్నకిష్టాపురం గ్రామ పంచాయతీ దేశ్యాతండా గ్రామానికి చెందిన కిషన్ ఇల్లెందులో నివాసం ఉంటున్న తన కుమారుడిని చూసేందుకు భార్యతో కలిసి బైక్‌పై ఇల్లెందుకు బయలుదేరాడు. జెండాలవాగు వద్ద మహబూబాబాద్ నుంచి ఇల్లెందుకు వస్తున్న ట్రాలీ ఢీకొట్టడంతో కిషన్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
అగ్నిప్రమాదంతో
సామగ్రి దగ్ధం
అశ్వారావుపేటరూరల్: ఓ ఇంట్లో వెలిగించిన దీపం కిందపడి మంటలు వ్యాపించి, సామగ్రి దగ్ధమైన ఘటన శనివారం చోటుచేసుకుంది. బాధితుడు, స్థానికుల కథనం ప్రకారం.. అశ్వారావుపేటలోని కట్టా రామదాసు వీధిలో నివాసం ఉండే అరవి శ్రీను, భార్యతో కలిసి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో పండ్ల వ్యాపారం చేస్తుంటారు. ఇంట్లో దేవుడి చిత్రపటాల వద్ద దీపారాధన చేసి షాపు వద్దకు వెళ్లారు. దీపం కిందపడి మంటలు మంటలు వ్యాపించి ఏసీ, కూలర్, ఫ్యాన్లు, బీరువాతోపాటు వంట సామగ్రి కాలిపోయాయి. ఇంట్లో నుంచి దట్టమైన పొగలు రావడంతో గమనించిన చుట్టు పక్కలవారు అక్కడికి చేరుకొని అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి