9 మంది మావోయిస్టులు లొంగుబాటు
దుమ్ముగూడెం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా ఎస్పీ కిరణ్‌చవాన్ ఎదుట ఆరుగురు మహిళా మావోయిస్టులతో సహా తొమ్మిది మంది మావోయిస్టులు బుధవారం లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చేపట్టిన గర్ వాపస్ అయే పునరావాస విధానంతో మావోయిస్టులు లొంగుబాటు పడుతున్నారని ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన తొమ్మిది మందిపై రూ.26లక్షల రివార్డు ఉన్నట్టు పేర్కొన్నారు. లొంగిపోయిన వారిలో బండు అలియాస్ బండి మడ్కం, మాసే అలియాస్ వెట్టి కన్ని, పదమ్ సమ్మి, మాద్వి హుంగా, పూనెం మగండి కడ్తి విజ్జే అలియాస్ జయో, మడ్కం శాంతి, ముచాకి మాసే, కడ్తి హిడియా అలియాస్ హితేష్ ఉన్నట్టు వివరించారు. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణసాయంగా రూ.25 వేలు అందించినట్లు తెలిపారు.