కారుకు నిప్పంటించిన గుర్తుతెలియని వ్యక్తులు
అశ్వాపురం: మండల పరిధిలోని చింతిర్యాల కాలనీ గ్రామంలో ఇంటి బయట పార్కింగ్ చేసిన కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. గ్రామానికి చెందిన హరీష్ రోజూ లాగే రాత్రి ఇంటి బయట తన కారు పార్కింగ్ చేశాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కారుకు నిప్పంటించారు. అర్ధరాత్రి 1.30 గంటలకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు లేచిన యజమాని మంటలు గమనించాడు. చుట్టు పక్కలవారిని నిద్రలేపి మంటలను ఆర్పివేశారు. సీఐ అశోక్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.