మార్చి త్రైమాసికంలో రూ.22,500 కోట్ల నష్టం | 159 listed firms saw material impact due to Covid-19 | Sakshi
Sakshi News home page

మార్చి త్రైమాసికంలో రూ.22,500 కోట్ల నష్టం

Published Mon, Aug 24 2020 6:36 AM | Last Updated on Mon, Aug 24 2020 6:36 AM

159 listed firms saw material impact due to Covid-19 - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మన దేశంలోకి అడుగు పెట్టిన మార్చి త్రైమాసిక కాలంలో 159 లిస్టెడ్‌ (బీఎస్‌ఈలో) కంపెనీలు రూ.22.538 కోట్ల మేర ఎబిట్డా (పన్ను, వడ్డీ, తరుగుదలకు ముందు) రూపంలో కోల్పోయినట్టు కన్సల్టెన్సీ సంస్థ యర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఈవై) ఓ నివేదిక రూపంలో తెలియజేసింది. డిసెంబర్‌ తో ముగిసిన త్రైమాసికంతో పోల్చినప్పుడు.. మార్చి త్రైమాసికంలో కరోనా కారణంగా ఏర్పడిన అడ్డంకులు 300 బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీలు, 115 అంతర్జాతీయ సంస్థల లాభదాయకత, ఆర్థిక పరిస్థితులు, నగదు లభ్యత తదితర అంశాలపై ఏ విధంగా ఉందని విశ్లేషించిన అనంతరం ఈ వివరాలను ఈవై ఒక నివేదికలో పొందుపరిచింది.

కరోనా వైరస్‌ ప్రభావం తమ వ్యాపార కార్యకలాపాలపై ఏ విధంగా ఉందన్న వివరాలను ఫలితాల సందర్భంగా కంపెనీలు విడుదల చేసిన వివరాలు, అందుబాటుులో ఉన్న ఇతర వివరాలను ఈవై అనలిస్టులు పరిగణనలోకి తీసుకుని చూశారు. జూన్‌ 5 నాటికి ఫలితాలను విడుదల చేసిన కంపెనీలను పరిశీలనలోకి తీసుకున్నారు.  మార్చి 25న దేశవ్యాప్త లాక్‌ డౌన్‌ విధించడం, అది మే చివరి వరకు అధికంగా కొనసాగడం తెలిసిందే. ఆ తర్వాత కూడా పాక్షిక లాక్‌ డౌన్‌ లు కొనసాగుతున్నాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను చవిచూస్తుండడం గమనార్హం.  

నివేదికలోని అంశాలు..
► 300 బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల్లో 159 కంపెనీలు ఎబిటా రూపంలో మార్చి త్రైమాసికంలో రూ.22,538  కోట్లను కోల్పోయాయి.  
► కరోనా మహమ్మారి ప్రభావం, అననుకూల ఆర్థిక పరిస్థితుల ప్రభావం బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్, బీమా రంగాలు (బీఎఫ్‌ఎస్‌ఐ), విమానయాన పరిశ్రమ, ఆటోమోటివ్, విద్యుత్తు, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, ట్రావెల్‌ రంగాలపై ఎక్కువగా పడింది.
► ఫార్మాస్యూటికల్స్, హెల్త్‌ కేర్, టెలికం రంగాలు మాత్రం ఈ కాలంలో మంచి వృద్ధిని        చూపించాయి.  
► రుణ నష్టాలకు సంబంధించి కేటాయింపులు గణనీయంగా పెంచాల్సిరావడం, ఇంపెయిర్మెంట్, నిల్వల కారణంగా ఏర్పడి నష్టాలు ప్రతికూల పరిణామాలకు కారణం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement