మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో.. వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలను స్థానిక పరిశ్రమలు సృష్టించాలని కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' పేర్కొన్నారు. ఈ లక్ష్యం సవాలుతో కూడుకున్నదే అయినప్పటికీ, సాధించవచ్చని ఆయన అన్నారు. 'నాగ్‌పూర్ స్కిల్ సెంటర్' ప్రారంభోత్సవంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఐదేళ్లలో నైపుణ్య శిక్షణ.. ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించడం అనే లక్ష్యం చాలా పెద్దది అయినప్పటికీ లక్ష్యాన్ని చేసుకోవచ్చు. నాగ్‌పూర్‌లోని మల్టీ-మోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్ అండ్ విమానాశ్రయంతో సహా.. పెద్ద ఎత్తున ఉద్యోగాలను అందించిన వివిధ ప్రాజెక్టుల ఉదాహరణలను ఆయన వివరించారు, ఇవి లక్ష ఉపాధి అవకాశాలను సృష్టించినట్లు గడ్కరీ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఉద్యోగాల కోసం నగరాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా.. వారికి శిక్షణ అందించడానికి నాగ్‌పూర్ నైపుణ్య కేంద్రాన్ని కోర్సులు ప్రారంభించాలని ఆయన సూచించారు.
టాటా స్ట్రైవ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) అమేయా వంజరి మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగాల కోసం పరిశ్రమ-సంబంధిత శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. సంస్థ వందలాది మంది యువతకు ఉపాధి కల్పించడంలో సహాయపడుతుంది, గత 11 సంవత్సరాలలో 2.5 మిలియన్లకు పైగా విద్యార్థులు ఈ కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందారని ఆయన వివరించారు.
ఇదీ చదవండి: నియామకాలు మళ్లీ షురూ!.. సత్య నాదెళ్ల
మేము తయారీ, విద్యుత్, సౌర, ఐటీ, బ్యాంకింగ్ రంగాలలో రెండు నుంచి మూడు నెలల కోర్సులను రూపొందించాము. వీటి తర్వాత ఉద్యోగ శిక్షణ.. నియామక అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని నేను నాగ్‌పూర్ యువతను కోరుతున్నానని అమేయా వంజరి అన్నారు.


