హైదరాబాద్‌లో ఈ ఏరియాలో అద్దె ఇళ్లకు ఫుల్‌ డిమాండ్‌ | 99acres.com report About Rental Houses demand In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఈ ఏరియాలో అద్దె ఇళ్లకు ఫుల్‌ డిమాండ్‌

Published Sat, Mar 26 2022 9:18 PM | Last Updated on Sat, Mar 26 2022 9:21 PM

99acres.com report About Rental Houses demand In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి తర్వాతి నుంచి కొనుగోలుదారుల అభిరుచులో మార్పులొచ్చాయి. ఎక్కువ విస్తీర్ణం ఉన్న గృహాల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. 1,100 చ.అ. నుంచి 1,300 చ.అ.ల్లోని 2 బీహెచ్‌కే, 1,500 చ.అ. నుంచి 2,500 చ.అ.ల్లోని 3 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లకు డిమాండ్‌ ఏర్పడిందని 99ఎకర్స్‌.కామ్‌ వెబ్‌పోర్టల్‌ సర్వేలో తేలింది. నానక్‌రాంగూడ, కోకాపేట, నార్సింగి, కొండాపూర్‌ వంటి  పశ్చిమ హైదరాబాద్‌లో కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు.ఆయా ప్రాంతాల్లోని ప్రాజెక్ట్‌ల గురించి విచారణ పెరిగింది. అలాగే ఆ ఏరియాల్లోనే కొత్త ప్రాజెక్ట్‌లు ఎక్కువగా లాంచింగ్స్‌ జరుగుతున్నాయి. 

మణికొండ, కూకట్‌పల్లి, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. చందానగర్‌లో అద్దెల వృద్ధి 3.54 శాతం, టోలిచౌకీలో 3.42 శాతం, మియాపూర్‌లో 3.10 శాతం, మణికొండలో 3.34 శాతం, కూకట్‌పల్లిలో 3.04 శాతం, గచ్చిబౌలిలో 2.98 శాతం, కొండాపూర్‌లో 3.11 శాతం, హైటెక్‌సిటీలో 3.15 శాతంగా ఉంది. హైదరాబాద్‌లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దాదాపు 12 వేల ఇన్వెంటరీ ఉంది. 

చదవండి: ఒకప్పుడు మాదాపూర్‌.. ఇప్పుడంతా నల్లగండ్ల వైపే
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement