న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా 1 ట్రిలియన్ (లక్ష కోట్లు) డాలర్ల వేల్యుయేషన్ గల దిగ్గజ సంస్థల సరసన చేరే లక్ష్యంతో అదానీ గ్రూప్ వ్యూహాలు రచించుకుంటోంది. ఇందులో భాగంగా 150 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు పెట్టనుంది. పర్యావరణ అనుకూల విద్యుత్ మొదలుకుని డేటా సెంటర్లు, ఎయిర్‌పోర్టులు, హెల్త్‌కేర్ మొదలైన విభాగాల్లో ఇన్వెస్ట్ చేయనుంది.
వెంచురా సెక్యూరిటీస్ నిర్వహించిన ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొన్న సందర్భంగా అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగ్‌షిందర్ ’రాబీ’ సింగ్ ఈ విషయాలు వివరించారు. వచ్చే 5–10 ఏళ్లల్లో హరిత హైడ్రోజన్ వ్యాపారంపై 50–70 బిలియన్ డాలర్లు, విద్యుత్ పంపిణీపై 7 బిలియన్ డాలర్లు, ట్రాన్స్‌పోర్ట్ యుటిలిటీ వ్యాపారంపై 12 బిలియన్ డాలర్లు, రహదారుల రంగంపై 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు సింగ్ తెలిపారు. డేటా సెంటర్ వ్యాపారంపై 6.5 బిలియన్ డాలర్లు, విమానాశ్రయాల విభాగంపై 9–10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment