ముంబై: ప్రముఖ అదానీ విల్మార్ కంపెనీ ఇన్వెస్టర్లకు భారీ లాభాలను కురిపిస్తుంది. కేవలం మూడు రోజుల్లోనే 68 శాతం స్టాక్ ధర పెరగడం విశేషం. ఫిబ్రవరి 8న అదానీ గ్రూప్ వంటనూనె బ్రాండ్ అదానీ విల్మార్ స్టాక్ ధర రూ.227గా ఉంటే అదే కంపెనీ స్టాక్ ధర ఫిబ్రవరి 10న రూ.379.50కి చేరుకుంది. ఈ స్టాక్ కొన్నవారి ఇంట ఇప్పుడు కనక వర్షం కురిపిస్తుంది. అదానీ విల్మార్ మార్కెట్ ధర దూసుకెళ్లడంతో కంపెనీ రూ.50,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్(మార్కెట్ క్యాప్) గల కంపెనీల జాబితాలో చేరింది. ప్రస్తుతం అదానీ విల్మార్ మార్కెట్ క్యాప్ రూ.50,201 కోట్లుగా ఉందని ఎన్ఎస్ఈ డేటాలో తేలింది. బిఎస్ఈలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.49,621 కోట్లుగా ఉంది.
రూ.50,000 కోట్లకు పైగా మార్కెట్ క్యాప్ కలిగిన ఆరో కంపెనీగా ఇది నిలిచింది. గ్రూపులో రూ.50,000 కోట్ల కంటే తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న ఏకైక కంపెనీ అదానీ పవర్, ఆ కంపెనీ ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ.42,059 కోట్లుగా ఉంది. మిగిలిన ఐదు కంపెనీలు అదానీ గ్రీన్ ఎనర్జీ(రూ.3 ట్రిలియన్), అదానీ ట్రాన్స్ మిషన్ (రూ.2.18 ట్రిలియన్), అదానీ ఎంటర్ ప్రైజెస్(రూ.1.96 ట్రిలియన్), అదానీ టోటల్ గ్యాస్ (రూ.1.96 ట్రిలియన్లు), అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (రూ.1.50 ట్రిలియన్లు) ఒక్కొక్కటి రూ.1 ట్రిలియన్లకు పైగా మార్కెట్ క్యాప్ కలిగి ఉన్నాయి. అదానీ విల్మార్ బ్రాండ్ అనేది అదానీ గ్రూపు & విల్మార్ గ్రూప్ మధ్య జాయింట్ వెంచర్, ఫార్చ్యూన్ బ్రాండ్ కింద భారతదేశంలో వంటనూనెలను తయారు చేసే కంపెనీగా ఇది నిలిచింది.
(చదవండి: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ ప్రాజెక్ట్..!)
Comments
Please login to add a commentAdd a comment