
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో మరో రికార్డు బ్రేక్ చేశారు. ఉగాది పండుగ రోజున ట్విట్టర్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 9 మిలియన్లు క్రాస్ చేసింది. ఈ విషయాన్ని ఓ ఫాలోవర్ ఆనంద్ మహీంద్రాకి గుర్తు చేయగా... నా ఫాలోవర్ల సంఖ్యకు గమనించిందుకు కృతజ్ఞతలు. పండగ రోజున ఈ ఘనత సాధించిందుకు ఆనందంగా ఉందంటూ ఆయన బదులిచ్చారు.
ట్విట్టర్‌లో చాలా మంది ఇండస్ట్రియలిస్టులు యాక్టి్‌వ్‌గా ఉన్నారు. ఫాలోవర్ల విషయానికి వస్తే వీరిలో రతన్‌టాటా అగ్ర భాగాన ఉన్నారు. ట్విట్టర్‌లో రతన్ టాటా ఫాలోవర్ల సంఖ్య 10.8 మిలియన్లుగా ఉంది. ఆయన తర్వాత ఆనంద్ మహీంద్రా 9 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు. ముకేశ్ అంబానీ 50.4 వేలు, అనిల్ అగర్వాల్ 1.22 లక్షలు, హర్ష్ గోయెంకా 1.7 మిలియన్లు, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి 61.1 వేలు, గౌతమ్ అదానీ 4.99 లక్షల మంది ఫాలోవర్లకు కలిగి ఉన్నారు.
వీరిలో ఆనంద్ మహీంద్రా, హర్ష్ గోయెంకా, అనిల్ అగర్వాల్‌లు రెగ్యులర్‌గా ట్వీట్స్ చేస్తుంటారు. కానీ కొండకచో తప్ప ట్వీట్లు చేయరు రతన్ టాటా. ఐనప్పటికీ రికార్డు స్థాయిలో 10.8 మిలియన్ల ఫాలోవర్లతో తన ప్రత్యేకతను చాటుకున్నారు.
చదవండి: ఎంతో టాలెంట్ ఉంది.. కానీ ఏం లాభం.. చూస్తే బాధేస్తోంది!
Comments
Please login to add a commentAdd a comment