కోట్ల రూపాయల వ్యవహారాలు, వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు లక్షలాది మంది కష్టమర్ల సంతృప్తి వంటి అనేక అంశాలతో నిత్యం బిజిగా ఉంటూనే లోకల్ టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా. అద్భుతమైన ప్రతిభ సొంతమైనా కూడా మారుమూల ప్రాంతాలకే పరిమితమైన ఎంతో మంది ఆనంద్ మహీంద్రా ద్వారా బయటి ప్రపంచానికి తెలిశారు. తాజాగా ఓ అస్సాం కళాకారుడిని ఆనంద్ మహీంద్రా మెచ్చుకున్నారు. తన ట్వీట్ ద్వారా ఆ కళాకారుడి ప్రతిభను మనమందుకు తెచ్చారు.
“Every artist was first an amateur.’—Emerson. This man’s garage may be working on vehicles, but his innate talent has turned it into a garage for the soul…. pic.twitter.com/emcGbBtxUH
— anand mahindra (@anandmahindra) December 29, 2021
అస్సాంకి చెందిన ఓ మెకానిక్ గ్యారేజీ నిర్వహిస్తూ బైకులు, స్కూటర్లు రిపేర్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కానీ అద్భుతమైన గాత్రం ఆ మెకానిక్ సొంతం. కాగా ఇటీవల స్థానికులు చేసిన ఇంటర్వ్యూ ద్వారా అతని ప్రతిభ వెలుగులోకి వచ్చింది. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌తో దేశవ్యాప్తంగా నెటిజన్లకు ఆ పాట చేరువైంది. మరుగున పడిపోయిన టాలెంట్ ప్రోత్సాహం అందివ్వడంలో ఆనంద్ మహీంద్రా చూపిస్తున్న చొరవను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment