Apple Car Launch Date, Features, Design and Price - Sakshi
Sakshi News home page

Apple Car: యాపిల్‌ సంచలనం..మార్కెట్‌లోకి స్టీరింగ్‌ లేని ఎలక్ట్రిక్‌ కార్‌, విడుదల ఎప్పుడంటే!

Published Sun, May 15 2022 12:05 PM | Last Updated on Sun, May 15 2022 2:45 PM

Apple Car Launch Date, Features, Design and Price - Sakshi

వరల్డ్‌ వైడ్‌గా ఆటోమొబైల్‌ రంగంలో ఎలక్ట్రిక్‌ కార్లతో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందుకు అనుగుణంగా పలు దిగ్గజ ఆటోమొబైల్‌ సంస్థలతో పాటు స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు సైతం ఎలక్ట్రిక్‌ కార్లను తయారు చేసే పనిలో పడ్డాయి. తాజాగా టెక్‌ దిగ్గజం యాపిల్‌ తయారు చేస్తున్న సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కార్లకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

2014లో యాపిల్‌ 'ప్రాజెక్ట్‌ టైటాన్‌' పేరుతో యాపిల్‌ కంపెనీ ఎలక్ట్రిక్‌ కార్లపై పనిచేస్తుంది. కానీ అంతర్గత కలహాలు, నాయకత్వ లోపాల కారణంగా యాపిల్‌కు ఎలక్ట్రిక్‌ కార్లను తయారు చేయడం సాధ్యం కాలేదు. అందుకే 2016లో కార్ల తయారీకి స్వస్తి చెందని, 2020లో మరోసారి ఎలక్ట్రిక్‌ కార్లను తయారు చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.తాజాగా యాపిల్‌ సంస్థ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లను వాహనదారులకు పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఓవైపు ఆటోమొబైల్‌ మార్కెట్‌లో అడుగుపెట్టాలని చూస్తుండగా..సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లపై ప్రయోగాలు చేస్తూ చేతులు కాల్చుకుంటున్న తన కాంపీటీటర్‌ టెస్లాకు చెక్‌ పెట్టాలని చూస్తుంది. 

యాపిల్‌ కారు ఫీచర్లు 
యాపిల్‌ ఎలక్ట్రిక్‌ కార్‌ టైటాన్‌ కంప్లీట్‌గా సెల్ఫ్‌ డ్రైవింగ్‌ చేసేలా అందుబాటులోకి రానుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే ఐఫోన్‌ను మనం ఎలా వినియోగిస్తామో.. టైటాన్‌ కారును అలాగే ఆపరేట్‌ చేసేకోవచ్చు. ఇందుకోసం యాపిల్ తన పాత ఒరిజినల్ పేటెంట్‌ను పునరుద్ధరించిందని, యాపిల్ కార్ ఒక ఫంక్షన్‌గా పనిచేయడానికి వీలుగా కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది.

యాపిల్‌ కార్‌ ఎలా పనిచేస్తుందంటే!
"గైడెన్స్ ఆఫ్ అటానమస్ వెహికల్స్ ఇన్ డెస్టినేషన్ సిగ్నల్స్ యూజింగ్ ఇంటెంట్ సిగ్నల్స్" అనే పేరుగల పేటెంట్ యాపిల్ కార్‌ను ఐఫోన్ టచ్ స్క్రీన్,వాయిస్ కంట్రోల్ ఫంక్షన్‌లను ఉపయోగించి పార్క్ చేసుకోవచ్చు. టెక్నాలజీ అందుబాటులోకి వస్తే మీరు మీ గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత పార్కింగ్ స్థలంలో ఒక నిర్దిష్ట ప్రదేశంలో సెల్ఫ్ డ్రైవింగ్ కారు పార్క్ చేయగలదు. కారు సామర్థ్యాలను పెంపొందించడంలో యాపిల్‌ తన వాయిస్ అసిస్టెంట్ సిరి కీరోల్‌ ప్లే చేయనుంది.  

స్టీరింగ్‌లు - పెడల్స్‌ ఉండవు


యాపిల్‌ కారుకు వీల్స్‌, పెడల్స్‌ ఉండవని తెలుస్తోంది. ఆ సంస్థ సీఈవో టిమ్‌ కుక్‌  పూర్తిగా ఇంటీరియర్ హ్యాండ్స్ ఫ్రీ డ్రైవింగ్‌పై దృష్టి పెట్టారు.బ్లూమ్‌బెర్గ్ ప్రకారం..కారు మోడల్‌ పైన ఇమేజ్‌లో మీరు చూస్తున్నట్లుగా ఉంటుంది. అమెరికన్‌ ఎలక్ట్రిక్‌ కార్ల మ్యానిఫ్యాక్చరింగ్‌ తయారీ సంస్థ 'కానూ' నుండి వచ్చిన లైఫ్‌స్టైల్ వెహికల్‌ను పోలి ఉండే డిజైన్‌తో కారును విడుదల చేయాలని యాపిల్‌ భావిస్తోంది. ఈ కారులో రైడర్లు స్టాండర్డ్ ఫ్రంట్, బ్యాక్ సీట్లలో కాకుండా వాహనం వైపు కూర్చోవచ్చు. అయితే యాపిల్‌ స్టీరింగ్‌ వీల్‌ ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండటం ఉపయోగకరంగా ఉంటుందని పలు కథనాలు చెబుతున్నాయి.దీనిపై క్లారిటీ రావాలంటే మరికొంత కాలం ఎదురు చూడాల్సి ఉంటుంది.  

విడుదల ఎప్పుడంటే 
ప్రముఖ బ్లాగ్‌ 'పేటెంట్లీ ఆపిల్' (Patently Apple) యాపిల్‌ ఎలక్ట్రిక్‌ కార్ల గురించి తన బ్లాగ్‌లో ప్రస్తావించింది. ఆ వివరాల ప్రకారం.. తన ఎలక్ట్రిక్‌ కారును  మార్కెట్‌లోకి ఎప్పుడు విడుదల చేస్తుందనే విషయాల్ని యాపిల్‌ సంస్థ ప్రస్తావించలేదు. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని కథనాలు మాత్రం 2025లో యాపిల్‌ ఎలక్ట్రిక్‌ కారు టైటాన్‌ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

చదవండి👉జీతం రూ.8కోట్లు..వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వద్దన్నారని జాబ్‌కు రిజైన్‌ చేశాడు!  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement