ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించాయి. ఆటోమొబైల్ కంపెనీలతో పాటుగా స్మార్ట్‌ఫోన్స్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ప్లాన్స్ చేస్తోన్నాయి. ఇప్పటికే షావోమీ, యాపిల్ లాంటి కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను రూపొందిస్తామని ప్రకటించాయి. యాపిల్ నుంచి రాబోతున్న ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. 2025లో ఎలక్ట్రిక్ కారును యాపిల్ లాంచ్ చేయాలని భావిస్తోంది.
రిచ్ లుక్‌తో ఐకార్..!
త్వరలోనే రాబోతున్న యాపిల్ కార్లకు చెందిన డిజైన్లను వానరమ అనే కార్ లీజింగ్ కంపెనీ బయటపెట్టింది. ఈ డిజైన్లపై యాపిల్ స్పందించలేదు. కాగా వనరామ బయటపెట్టిన డిజైన్లను ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ కారు కోసం యాపిల్ దాఖలు చేసిన అన్ని పేటెంట్‌లకు అనుగుణంగా ఉండేలా చూసుకుంది.
వానరమ ఎఫ్1 కారు వలె రూపొందించబడిన స్టీరింగ్ వీల్‌తో సహా బేర్ అంతర్గత భాగాలను చిత్రీకరించింది. కాగా ఎలక్ట్రిక్ కార్లపై పూర్తి స్వయంప్రతిపత్తిని సాధించాలనే ఆశతో యాపిల్ స్టీరింగ్ వీల్‌ను పూర్తిగా తొలగించే అవకాశం ఉన్నట్లునివేదికలు సూచిస్తున్నాయి. ఈ డిజైన్‌లో ఫ్రంట్ డోర్స్ ముందువైపుకు, వెనుక డోర్స్ వెనుకవైపుకు తెరుచుకొనున్నాయి. ఈ డోర్స్‌కు హ్యండిల్స్ లేకపోవడం విశేషం. ఆటోమోటిక్ వాయిస్‌సపోర్ట్ ‘సిరి’తో రానుంది. అంతేకాకుండా సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్‌ను కూడా యాపిల్ అందుబాటులోకి తేనుంది.
చదవండి: ప్రపంచంలోని తొలి ఆటోమొబైల్ కంపెనీగా రికార్డు సృష్టించిన మెర్సిడెస్ బెంజ్..!
Comments
Please login to add a commentAdd a comment