సాక్షి,న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ఆపిల్ అభిమానులు ఎపుడెపుడా అనిఎదురుచూస్తున్న ఆపిల్ ఈవెంటును కంపెనీ ఎట్టకేలకు ధృవీకరించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో అక్టోబర్ 13న వర్చువల్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. స్టీవ్ జాబ్స్ థియేటర్ నుంచి ఈ వేడుక ప్రారంభమవుతుంది. ఈ మేరకు "టైమ్ ఫ్లైస్" మాదిరిగానే, "హాయ్ స్పీడ్" అనే ట్యాగ్ లైన్‌తో ఆపిల్ ఆహ్వానాలను పంపింది. మంగళవారం అక్టోబర్ 13 న రెండవ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది. (అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ : ఐఫోన్ 11పై ఆఫర్)
ఆపిల్ కొత్త లైనప్ ఐఫోన్‌లు, చిన్న హోమ్‌పాడ్ స్మార్ట్ స్పీకర్, ఓవర్ ఇయర్ హెడ్‌ఫోన్స్, సరికొత్త ఆపిల్ టీవీ స్ట్రీమింగ్ బాక్స్, టైల్ లాంటి లొకేషన్ ట్రాకింగ్ పరికరాన్ని విడుదల చేయనుంది. ‘హాయ్, స్పీడ్’ ట్యాగ్‌లైన్ ఇవ్వడంతో హై-స్పీడ్ మద్దతుకు గా 5జీ కనెక్టివిటీతోఈ ఫోన్లను లాంచ్ చేయనుందని చాలా ఊహాగానాలు ఉన్నాయి. ప్రధానంగా తరువాతి తరం ఐఫోన్ "ఐఫోన్ 12" సిరీస్ పై అందరి ఆసక్తి నెలకొని ఉంది. ఐఫోన్ 12 లాంచింగ్ పై అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఐఫోన్ 12, ఐఫోన్ 12 మాక్స్, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మాక్స్ మోడళ్లను లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అనుబంధమైన "ఎయిర్ టాగ్స్" ను వెల్లడిస్తుందని లాంచ్ చేయనుంది. "ఫైండ్ మై" యాప్ ద్వారా "ఎయిర్ ట్యాగ్స్" పని చేయనుందని ఇప్పటికే పలు అంచనాలు వెలువడిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment