ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ చివరి దశలో! | Astrazeneca conducting late stage clinical trails of Covid-19 vaccine | Sakshi
Sakshi News home page

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ చివరి దశలో!

Published Tue, Sep 1 2020 11:01 AM | Last Updated on Tue, Sep 1 2020 5:05 PM

Astrazeneca conducting late stage clinical trails of Covid-19 vaccine - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాలన్నిటినీ వణికిస్తున్న కోవిడ్‌-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లను వీలైనంత వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని అమెరికా ప్రభుత్వం ఆశిస్తోంది. ఇందుకు వీలుగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్‌ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ ఏజెడ్‌డీ 1222 చివరి దశ క్లినికల్‌ పరీక్షలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో నేటి నుంచి యూఎస్‌ సహకారంతో రెండు డోసేజీలు ఇవ్వడం ద్వారా 30,000 మందిపై వ్యాక్సిన్‌ను పరీక్షించనున్నట్లు తెలుస్తోంది. తద్వారా నవంబర్‌కల్లా వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించాలని ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ ఆశిస్తున్నారు. ఆస్ట్రాజెనెకాతోపాటు.. బయోఎన్‌టెక్‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షల డేటాను అక్టోబర్‌కల్లా విశ్లేషించే వీలున్నట్లు యూఎస్‌ దిగ్గజం ఫైజర్‌ తాజాగా పేర్కొంది.

ఇప్పటికే ప్రయోగాలు
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ఇప్పటికే బ్రిటన్‌, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాలో చివరి దశ పరీక్షలలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వీటికి జతగా జపాన్, రష్యాలోనూ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. యూఎస్‌లో నిర్వహించిన మూడో దశ పరీక్షల సహకారంతో ప్రపంచవ్యాప్తంగా 50,000 మందిపై తుది దశ ప్రయోగాలు చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement