ముంబై: కరోనా వచ్చిన తర్వాత టెక్నాలజీ అభివృద్ధి రంగంలో పురుషులతో పోలిస్తే మహిళలకే ఎక్కువ అవకాశాలు అందుబాటులోకి వచ్చినట్టు బ్రిడ్జ్‌ల్యాబ్స్ సంస్థ తెలిపింది. బ్రిడ్జ్‌ల్యాబ్ టెక్ ఎంప్లాయిబులిటీ క్వొటెంట్ టెస్ట్‌లో మహిళలకు 42 శాతం స్కోరు రాగా, పురుషుల స్కోరు 39 శాతంగా ఉంది.
‘‘టెక్నాలజీ రంగంలోని వివిధ విభాగాల్లో ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఉద్యోగులను అట్టిపెట్టుకోవడం పెద్ద సమస్య కానుంది. మహిళల నైపుణ్యాలను తక్కువగా వినియోగించుకోవడం కనిపించే వ్యత్యాసాల్లో ఒకటి. కొత్తగా చేరే మహిళలు అయినా, కెరీర్‌లో కొంత విరామం తర్వాత వచ్చి చేరే వారయినా నైపుణ్య అంతరాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పని ప్రదేశంలో వైవిధ్యం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం’’ అని బ్రిడ్జ్‌ల్యాబ్స్ వ్యవస్థాపకుడు నారయణ్ మహదేవన్ తెలిపారు. 40,000 మంది ఇంజనీరింగ్ నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను సంస్థ విడుదల చేసింది. ఉన్నత విద్యార్హతలు, ఎంతో అనుభవం ఉన్న మహిళలు మిడ్ మేనేజ్‌మెంట్ ఉద్యోగాల స్థాయికి చేరుకుంటున్నట్టు, తమ ఉద్యోగాల నుంచి తరచుగా బ్రేక్ తీసుకుంటున్నట్టు బ్రిడ్జ్‌ల్యాబ్స్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment