ఆశ్చర్యపోకండి.. ఆటోమేషన్, ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వేగంగా పుణికి పుచ్చుకుంటున్న లేటెస్ట్ టెక్నాలజీ కారణంగా రోబోలు హ్యూమన్ వర్క్‌ర్‌ల స్థానాన్ని భర్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. కస్టమర్ సపోర్ట్, ఎంటర్‌టైన్‌మెంట్ సెక్టార్‌తో సహా వివిధ రంగాలలో 'వర్చువల్ వర్కర్ల' కోసం వ్యాపార వేత్తలు , కంపెనీలు భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసే ధోరణి చైనాలో ఎక్కుగా ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ముఖ్యంగా పలు కంపెనీలు యానిమేషన్, సౌండ్ టెక్, మెషిన్ లెర్నింగ్ కలయికతో లైవ్ స్ట్రీమ్‌లో పాడటం, ఇంటరాక్ట్ అయ్యేలా వర్చువల్ పీపుల్స్ డిజైన్ చేశారు. ఇప్పుడీ ఈ ప్రాణం లేని ఉద్యోగులకు చైనాలో యమ డిమాండ్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి.
బైదు కోసం
చైనా ఇంటర్నెట్ సెర్చింగ్ దిగ్గజం బైదు క్లయింట్‌ల కోసం పని చేస్తున్న వర్చువల్ పీపుల్ ఉద్యోగుల సంఖ్య గత సంవత్సరం కంటే రెట్టింపు అయ్యింది. బైదు వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, ఫర్మార్లతో కూడిన ప్రాజెక్ట్‌లపై పని చేస్తోంది. ఆ ప్రాజెక్ట్‌లలో పనిచేసే ఈ వర్చువల్ వర్కర్లకు సంవత్సరానికి మినిమమ్ $2,800 (రూ. 2,32,045) నుండి అత్యధికంగా $14,300 (రూ. 11,84,845) వరకు చెల్లిస్తుంది.
ఈ సందర్భంగా బైదు వర్చువల్ పీపుల్, రోబోటిక్స్ విభాగం అధిపతి లి షియాన్ మాట్లాడుతూ.. వర్చువల్ పీపుల్ నిర్వహించే ప్రాజెక్ట్‌లలో స్టేట్ మీడియా, లోకల్ టూరిజం బోర్డ్‌లు, ఆర్థిక సేవల వ్యాపారాలు ఉన్నాయి. సాంకేతికత అభివృద్ధి చెంది ఈ వర్చువల్ ఉద్యోగుల్ని ఉపయోగించడంతో గతేడాదితో పోలిస్తే ఖర్చులు దాదాపు 80 శాతం తగ్గాయని అన్నారు. 2025 నాటికి వర్చువల్ పర్సన్ ఇండస్ట్రీ మొత్తం ఏటా 50శాతం వృద్ధి చెందుతుందని షియాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
వర్చువల్ ఉద్యోగుల కోసం చైనా ఆరాటం
వర్చువల్ వ్యక్తులను తయారు చేసేందుకు చైనా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. 2025 నాటికి మునిసిపల్ వర్చువల్ పర్సన్స్ మార్కెట్ విలువను 50 బిలియన్ యువాన్‌లకు పెంచడానికి బీజింగ్ ప్రభుత్వం వ్యూహాన్ని ఆవిష్కరించింది. చైనాలోని 45 శాతం మంది ప్రకటనదారులు తాము వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్ పనితీరును స్పాన్సర్ చేస్తామని, 2023లో బ్రాండ్ ఈవెంట్లు కోసం వర్చువల్ పీపుల్స్‌ను ఆహ్వానిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment