baidu
-
కొత్తగా ఎర్నీ బాట్!
హాంకాంగ్: మైక్రోసాఫ్ట్ సంస్థ తీసుకొచ్చిన కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత చాట్‌బాట్ ‘చాట్‌జీపీటీ’ ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోంది. కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. రోజురోజుకూ యూజర్ల సంఖ్య పెరుగుతోంది. దీనికి పోటీగా చైనా సెర్చ్ ఇంజిన్ బైదూ కొత్తగా ఏఐ ఆధారిత చాట్‌బాట్ ‘ఎర్నీబాట్’ను గురువారం ఆవిష్కరించింది. అయితే, ఇది యూజర్లను నిరాశపర్చింది. ఎర్నీబాట్ సంపూర్ణమేమీ కాదని, ఇంకా మెరుగుపరుస్తామని బైదూ సీఈఓ రాబిన్ లీ చెప్పారు. ఎర్నీబాట్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో బైదూ కంపెనీ షేర్ల విలువ 10 శాతం పడిపోయింది. ఎర్నీబాట్ను ఉపయోగించుకొనేందుకు ఇప్పటిదాకా 650 కంపెనీలు ముందుకొచ్చాయని రాబిన్ లీ తెలిపారు. ఈ చాట్‌బాట్ మొదటి వెర్షన్‌ను 2019లో అభివృద్ధి చేశామన్నారు. -
చాట్‌జీపీటీపై మరో దిగ్గజ సంస్థ కన్ను.. త్వరలో అందుబాటులోకి
కృత్రిమమేథలో (ఏఐ) సంచలనంగా మారిన చాట్‌జీపీటీపై ప్రపంచ దేశాల్లో ఆసక్తి పెరుగుతోంది. తాజాగా చైనా సోషల్ మీడియా దిగ్గజం బైదూ.. ఓపెన్ ఏఐ సంస్థ తయారు చేసిన చాట్‌జీపీటీ తరహాలో కృత్తిమ చాట్‌బోట్‌ను అందుబాటులోకి తీసుకొని రావాలని యోచిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. చైనా అతిపెద్ద సెర్చ్ ఇంజన్ కంపెనీ బైదూ మార్చిలో చాట్‌జీపీటీ తరహాలో అప్లికేషన్‌ను ప్రారంభించనుంది. ప్రారంభంలో మొదట సెర్చ్ సర్వర్లలో ఈ లేటెస్ట్ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయనుంది. పేరు ఖరారు చేయని చాట్‌బోట్.. చాట్ జీపీటీ తరహాలో పనిచేస్తుందని వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. ఈ తరుణంలో బ్లూమ్‌బెర్గ్ నివేదిక తర్వాత బైదూ కంపెనీ షేర్లు 5.8% వరకు పెరిగాయి. ఇది దాదాపు నాలుగు వారాల్లో అతిపెద్ద ఇంట్రాడే లాభాల్ని తెచ్చి పెట్టింది. బైదూ ఆన్లైన్ మార్కెటింగ్ నుండి ఏఐకి మారేందుకు మారేందుకు సంవత్సరాల పాటు పరిశోధనలు జరిపింది. ఇందుకోసం బిలియన్ డాలర్లను వెచ్చింది. అనేక సంవత్సరాలుగా డేటాపై శిక్షణ పొందిన లార్జ్ స్కేల్ మెషీన్ లెర్నింగ్ మోడల్‌తో.. చాట్‌జీపీటీకి గట్టి పోటీ ఇస్తుందని నివేదికలు చెబుతున్నాయి. -
ప్రాణం లేని ఉద్యోగి .. జీతం రూ. 11లక్షల ప్యాకేజీ
ఆశ్చర్యపోకండి.. ఆటోమేషన్, ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వేగంగా పుణికి పుచ్చుకుంటున్న లేటెస్ట్ టెక్నాలజీ కారణంగా రోబోలు హ్యూమన్ వర్క్‌ర్ల స్థానాన్ని భర్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. కస్టమర్ సపోర్ట్, ఎంటర్టైన్మెంట్ సెక్టార్‌తో సహా వివిధ రంగాలలో 'వర్చువల్ వర్కర్ల' కోసం వ్యాపార వేత్తలు , కంపెనీలు భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసే ధోరణి చైనాలో ఎక్కుగా ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా పలు కంపెనీలు యానిమేషన్, సౌండ్ టెక్, మెషిన్ లెర్నింగ్ కలయికతో లైవ్ స్ట్రీమ్‌లో పాడటం, ఇంటరాక్ట్ అయ్యేలా వర్చువల్ పీపుల్స్ డిజైన్ చేశారు. ఇప్పుడీ ఈ ప్రాణం లేని ఉద్యోగులకు చైనాలో యమ డిమాండ్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. బైదు కోసం చైనా ఇంటర్నెట్ సెర్చింగ్ దిగ్గజం బైదు క్లయింట్ల కోసం పని చేస్తున్న వర్చువల్ పీపుల్ ఉద్యోగుల సంఖ్య గత సంవత్సరం కంటే రెట్టింపు అయ్యింది. బైదు వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు, ఫర్మార్లతో కూడిన ప్రాజెక్ట్‌లపై పని చేస్తోంది. ఆ ప్రాజెక్ట్‌లలో పనిచేసే ఈ వర్చువల్ వర్కర్లకు సంవత్సరానికి మినిమమ్ $2,800 (రూ. 2,32,045) నుండి అత్యధికంగా $14,300 (రూ. 11,84,845) వరకు చెల్లిస్తుంది. ఈ సందర్భంగా బైదు వర్చువల్ పీపుల్, రోబోటిక్స్ విభాగం అధిపతి లి షియాన్ మాట్లాడుతూ.. వర్చువల్ పీపుల్ నిర్వహించే ప్రాజెక్ట్‌లలో స్టేట్ మీడియా, లోకల్ టూరిజం బోర్డ్‌లు, ఆర్థిక సేవల వ్యాపారాలు ఉన్నాయి. సాంకేతికత అభివృద్ధి చెంది ఈ వర్చువల్ ఉద్యోగుల్ని ఉపయోగించడంతో గతేడాదితో పోలిస్తే ఖర్చులు దాదాపు 80 శాతం తగ్గాయని అన్నారు. 2025 నాటికి వర్చువల్ పర్సన్ ఇండస్ట్రీ మొత్తం ఏటా 50శాతం వృద్ధి చెందుతుందని షియాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. వర్చువల్ ఉద్యోగుల కోసం చైనా ఆరాటం వర్చువల్ వ్యక్తులను తయారు చేసేందుకు చైనా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. 2025 నాటికి మునిసిపల్ వర్చువల్ పర్సన్స్ మార్కెట్ విలువను 50 బిలియన్ యువాన్లకు పెంచడానికి బీజింగ్ ప్రభుత్వం వ్యూహాన్ని ఆవిష్కరించింది. చైనాలోని 45 శాతం మంది ప్రకటనదారులు తాము వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ పనితీరును స్పాన్సర్ చేస్తామని, 2023లో బ్రాండ్ ఈవెంట్లు కోసం వర్చువల్ పీపుల్స్‌ను ఆహ్వానిస్తామని చెప్పారు. చదవండి👉 ‘మీ ఉద్యోగం పోయింది కదా..మీకెలా అనిపిస్తుంది?’ చదవండి👉 ప్చ్, పాపం..మెటాలో ‘సురభిగుప్తా’ ఉద్యోగం ఊడింది! -
డ్రైవర్ లేని రోబో ట్యాక్సీ
బీజింగ్: డ్రైవర్ అవసరం లేని ఎలక్ట్రిక్ రోబో ట్యాక్సీలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయా? అవుననే చెబుతోంది చైనా దిగ్గజ టెక్నాలజీ సంస్థ బైడూ. ‘అపోలో ఆర్టీ6’ పేరుతో సెల్ఫ్–డ్రైవింగ్ ట్యాక్సీని బైడూ ఆవిష్కరించింది. ఇది ‘అపోలో గో’ యాప్ ఆధారంగా పనిచేస్తుందని చెబుతోంది. తనంతట తానే నడుపుకొనే ఈ ట్యాక్సీ తయారీకి అయిన ఖర్చు రూ.29,54,635 (37 వేల డాలర్లు). ఇందులో స్టీరింగ్ చక్రం ఉండదు. అంటే వాహనం మరింత విశాలంగా మారుతుంది. ప్రయాణికులకు అదనపు స్థలం లభిస్తుంది. డ్రైవింగ్‌లో 20 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి వాహనాన్ని ఎలా నడిపిస్తోడో అదే తరహాలో ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ నడుస్తుందని బైడూ వెల్లడించింది. ఇందులో 38 రకాల సెన్సార్లు ఉంటాయి. యాప్ నుంచి అందే ఆదేశాల మేరకు నడుచుకుంటుంది. 2023 నాటికి మార్కెట్లోకి తీసుకొచ్చే ఆలోచన ఉందని బైడూ చెబుతోంది. కనీసం లక్ష క్యాబ్‌లను తీసుకొస్తామని అంటోంది. రోబో ట్యాక్సీ తయారీ గూగుల్‌కు చైనా ఇచ్చిన సమాధానమని బైడూ సీనియర్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ వ్యాఖ్యానించారు. చైనాలో అపోలో గో యాప్‌ను ఇప్పటికే చాలామంది వాడుతున్నారు. ‘అపోలో ఆర్టీ6’లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. డోర్లను చేత్తో తెరవాల్సిన అవసరం లేదు. బ్లూటూత్ కనెక్షన్ లేదా యాప్ ద్వారా తెరవొచ్చు. చుట్టుపక్కల పరిసరాలను అనుక్షణం గమనించడానికి సెల్ఫ్–డ్రైవింగ్ కార్లలో 2డీ కెమెరాలు, డెప్త్–సెన్సింగ్ లైట్ డిటెక్షన్, రేంజింగ్(లిడార్) యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ఎదురుగా వచ్చే మనుషులు, సిగ్నళ్లు, ప్రమాదాలను కచ్చితంగా గుర్తించడానికి కృత్రిమ మేధ టెక్నాలజీని ఉపయోగిస్తారు. భవిష్యత్తులో సాధారణ ట్యాక్సీ ధరలో సగం ధరకే రోబో ట్యాక్సీని విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని బైడూ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ రాబిన్ లీ చెప్పారు. 2025 నాటికి 65 నగరాల్లో, 2030 నాటికి 100 నగరాల్లో రోబో ట్యాక్సీ సేవలను ప్రారంభించాలని బైడూ యోచిస్తోంది. సెర్చ్ ఇంజిన్, ఆన్లైన్ ప్రకటన సేవల్లో పేరుగాంచిన బైడూ సంస్థ ఇటీవలి కాలంలో సెల్ఫ్–డ్రైవింగ్ వాహనాలు, కృత్రిమ మేధ సాంకేతికతపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. అమెరికాలో గూగుల్ అనుబంధ సంస్థ అల్ఫాబెట్స్ వేమో 2020లో అరిజోనాలో డ్రైవర్‌లెస్ ట్యాక్సీ సర్వీసులను ఆవిష్కరించింది. -
అమెరికా ఎక్స్ఛేంజీల నుంచి డ్రాగన్ అవుట్ !
వాషింగ్టన్: అమెరికా, చైనాల మధ్య వైరం రోజురోజుకు మరింతగా ముదురుతోంది. వాణిజ్య యుద్ధంగా మొదలైనది కాస్తా ఆ తర్వాత టెక్నాలజీ పోరుకు దారితీసింది. 5జీ టెలికం పరికరాల చైనా దిగ్గజం హువావేపై అమెరికా అనేక ఆంక్షలు విధించి దానితో తమ దేశ సంస్థలేవీ వ్యాపార లావాదేవీలు జరపకుండా దాదాపు అడ్డుకట్ట వేసేసింది. ఇక, కరోనా వైరస్ వివరాలను తొక్కిపెట్టి ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిని వ్యాప్తి చేసిందంటూ చైనాపై మండిపడుతున్న అమెరికా ప్రస్తుతం మరో కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. తమ దేశ స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయిన చైనా కంపెనీలను డీలిస్ట్ చేయడం ద్వారా బిలియన్ల కొద్దీ అమెరికన్ డాలర్లు పెట్టుబడులుగా పొందుతున్న చైనీస్ సంస్థలను, పరోక్షంగా చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లుకు అమెరికా సెనేట్ తాజాగా ఆమోదముద్ర వేసింది. ‘నేను కొత్తగా మరో ప్రచ్ఛన్న యుద్ధం కోరుకోవడం లేదు. నేను..నాతో పాటు మిగతా అందరూ కూడా నిబంధనల ప్రకారం చైనా నడుచుకోవాలనే కోరుకుంటున్నారు‘ అని బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా దీన్ని ప్రవేశపెట్టిన సెనేటర్లలో ఒకరైన జాన్ కెనెడీ వ్యాఖ్యానించారు. తాజా పరిణామంతో ఆలీబాబా, బైదు తదితర దిగ్గజ చైనా కంపెనీలకు డీలిస్టింగ్ గండం ఏర్పడింది. బిల్లు ఏం చెబుతోంది .. హోల్డింగ్ ఫారిన్ కంపెనీస్ అకౌంటబుల్ యాక్ట్ పేరిట ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం అమెరికా సెక్యూరిటీస్ చట్టాలను పాటించడంలో విఫలమైనందుకు గాను నాస్డాక్, ఎన్వైఎస్ఈ స్టాక్ ఎక్సే్చంజీల నుంచి చైనా కంపెనీలను డీలిస్ట్ చేయొచ్చు. గతేడాది మార్చిలోనే సెనేటర్లు జాన్ కెనెడీ, క్రిస్ వాన్ హోలెన్ దీన్ని సెనేట్‌లో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం లిస్టెడ్ విదేశీ కంపెనీలు తమపై తమ దేశ ప్రభుత్వ నియంత్రణేమీ లేదంటూ ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు అమెరికాలో పబ్లిక్ కంపెనీల ఖాతాలను సమీక్షించే బోర్డు పీసీఏవోబీ తమ ఖాతాలను కూడా తనిఖీ చేసేందుకు అంగీకరించాలి. వరుసగా మూడేళ్ల పాటు నిరాకరించిన పక్షంలో నిషేధం, డీలిస్టింగ్ తప్పదు. ఇది ప్రధానంగా విదేశీ కంపెనీలన్నింటికీ వర్తించేదే. అయితే, చైనా కంపెనీల ఆడిటింగ్ విషయంలోనే సహకారం దొరకడం లేదంటూ పీసీవోఏబీ చెబుతోంది. ఈ నేపథ్యంలో చైనా కంపెనీలపైనే అమెరికా ఎక్కువ కఠినంగా చర్యలు అమలు చేయనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సేల్స్ అకౌంటింగ్ మోసాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటు న్న చైనా సంస్థ ‘లకిన్ కాఫీ’ ను డీలిస్ట్ చేస్తున్నట్లు నాస్డాక్ ప్రకటించడం దీనికి మరింత ఊతమిస్తోంది. చైనా ముందస్తు వ్యూహాలు.. అమెరికా తమ కంపెనీలపై గురిపెట్టే ప్రమాదాన్ని ముందుగానే ఊహించినా చైనా కూడా తదుపరి వ్యూహాలతో సిద్ధంగా ఉంది. హాంకాంగ్‌లో నిరసనలను అణగదొక్కే విషయంలో తమకు మద్దతుగా నిల్చిన బ్రిటన్ వైపు చూస్తోంది. ఒకవేళ అమెరికన్ ఎక్సే్చంజీల నుంచి డీలిస్ట్ అయిపోతే ప్రత్యామ్నాయంగా లండన్ ఎక్సే్చంజీలో కంపెనీలను లిస్ట్ చేసే ప్రయత్నాల్లో ఉంది. లండన్‌లో లిస్ట్ కాదల్చుకున్న కంపెనీల దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియను పునఃప్రారంభించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్వదేశీ కంపెనీలకూ ట్రంప్ వార్నింగ్.. చైనాతో వాణిజ్య యుద్ధం మొదలైనప్పట్నుంచీ అమెరికన్ కంపెనీలను అక్కణ్నుంచి వచ్చేయాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తూనే ఉన్నారు. దీంతో టెక్ దిగ్గజం యాపిల్ సహా పలు కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ తదితర దేశాలకు తయారీ కార్యకలాపాలు మళ్లించడంపై కసరత్తు చేస్తున్నాయి. అయితే, ఆయా కంపెనీలను అమెరికాకే రప్పించే ప్రయత్నాల్లో ట్రంప్ ఉన్నారు. చైనా నుంచి తయారీ కేంద్రాలను స్వదేశానికే తరలించాలని.. అలా కాకుండా భారత్, ఐర్లాండ్ వంటి ఇతర దేశాలకు వెడితే వాటిపై పన్నుల మోత మోగిస్తామని ఈమధ్యే మరోమారు హెచ్చరించారు. అంతే కాకుండా.. చైనా కంపెనీల్లో తమ సంస్థలు ఇన్వెస్ట్ చేయకుండా కూడా అమెరికా చర్యలు తీసుకుంటోంది. అమెరికాలో లిస్టయిన చైనా కంపెనీల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం శ్రేయస్కరం అంటూ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌రాక్‌కు నేషనల్ లీగల్ అండ్ పాలసీ సెంటర్ సూచించింది. పర్యావరణ కార్యకర్తల ఆందోళనల కారణంగా బ్లాక్‌రాక్ ఇప్పటికే కొన్ని బొగ్గు కంపెనీల నుంచి తప్పుకుంది. ప్రభుత్వ పెన్షన్ ఫండ్‌ను నిర్వహించే థ్రిఫ్ట్ సేవింగ్స్ ప్లాన్ సంస్థ .. ఇన్వెస్ట్ చేసే విదేశీ స్టాక్స్ జాబితా నుంచి చైనా కంపెనీలను తప్పించడంలోనూ ట్రంప్ ప్రస్తుతానికి సఫలమయ్యారు. ఇది దాదాపు 500 బిలియన్ డాలర్ల నిధిని నిర్వహిస్తోంది. తమ ఇన్వెస్టర్లకు కొత్తగా అంతర్జాతీయ స్టాక్స్‌లో కూడా అవకాశం కల్పించే ఉద్దేశంతో 50 బిలియన్ డాలర్ల ఇంటర్నేషనల్ ఫండ్ పథకం ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన విదేశీ స్టాక్స్ జాబితాలో చైనా కంపెనీలు లేకుండా చూసేలా ట్రంప్ ఒత్తిడి తెచ్చారని పరిశ్రమవర్గాలు తెలిపాయి. దాదాపు 170 చైనా కంపెనీలు.. అమెరికాలోని నాస్డాక్, ఎన్వైఎస్ఈ స్టాక్ ఎక్సే్చంజీల్లో దాదాపు 170 చైనా కంపెనీలు లిస్టయి ఉన్నాయి. చైనా ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తూ అమెరికాలో లిస్టయిన భారీ కంపెనీలు పదికి పైగా ఉన్నాయి. పెట్రోచైనా, చైనా లైఫ్, చైనా టెలికం, చైనా ఈస్టర్న్, చైనా సదరన్, హువానెంగ్ పవర్, అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ చైనా, చైనా పెట్రోలియం ఈ జాబితాలో ఉన్నాయి. ఇక టెక్ దిగ్గజాల్లో బైదు, ఆలీబాబా, పిన్‌డువోడువో, జేడీడాట్‌కామ్ మొదలైన సంస్థలు ఉన్నాయి. వీటిలో ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్, బైదు, జేడీడాట్‌కామ్ సంస్థల సంయుక్త మార్కెట్ విలువ 500 బిలియన్ డాలర్ల పైగానే ఉంటుంది. -
వేదికపైనే సీఈవో నెత్తిమీద నీళ్లు గుమ్మరించాడు!
షాంఘై/బీజింగ్: చైనా ఇంటర్నెట్ దిగ్గజం బైడు సీఈవో రాబిన్ లీకి చేదు అనుభవం ఎదురైంది. బైడు సంస్థ వార్షిక సదస్సులో భాగంగా ఆయన వేదిక మీద మాట్లాడుతుండగా.. ఒక వ్యక్తి ఆకస్మికంగా వేదిక మీదకు వచ్చి.. బాటిల్లోని నీళ్లను ఆయన నెత్తిమీద గుమ్మరించాడు. ఈ హఠాత్ పరిణామంతో కంగుతిన్న రాబిన్ లీ.. ‘నీ సమస్య ఏందోయ్’ అంటూ ఆ వ్యక్తి మీద కేకలు వేశారు. ఆ వెంటనే ఈ పరిణామం నుంచి వెంటనే తేరుకున్న రాబిన్ లీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. బైడు క్రియేట్ 2019 సదస్సులో భాగంగా బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సదస్సులో కృత్రిమ మేధస్సు (ఏఐ)ను ఎలా వినియోగించుకోవాలని అంశంపై రాబిన్ లీ ప్రసంగిస్తుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. నెత్తిమీద నీళ్లు గుమ్మరించినా.. ఒకింత అసహనానికి గురికాకుండా రాబిన్ లీ ప్రసంగాన్ని కొనసాగించడంతో.. ఆహూతులు ఆయనను కరతాళ ధ్వనులతో ప్రశంసించారు. రాబిన్ లీపై యువకుడు నీళ్లు గుమ్మరించిన ఘటనపై సోషల్ మీడియాలో సెటైర్లు, జోకులు వ్యక్తమవుతున్నాయి. ‘మీరు రాబిన్ లీని ఎంతైనా ద్వేషించండి. కానీ, ఇలా నీళ్లను వృథా చేయడం మాత్రం బాగలేదు’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
సీఈవో రాబిన్ లీకి చేదు అనుభవం
-
మరో ప్రయోగానికి ఇంటర్నెట్ దిగ్గజం శ్రీకారం
బీజింగ్ : చైనా ఇంటర్నెట్ దిగ్గజం ‘బైదు’ మరో నూతన ప్రాజెక్ట్‌ను చేపట్టింది. డ్రైవర్ రహిత, ఎలక్ట్రిక్ బస్సులను రూపొందించేందుకు చైనాలో బస్సుల తయారీకి పేరు గాంచిన ‘కింగ్‌లాంగ్’ కంపెనీతో జట్టు కట్టింది. ‘అపోలాంగ్’ పేరుతో కింగ్‌లాంగ్ తయారు చేయనున్న ఈ డ్రైవర్ రహిత ఎలాక్ట్రానిక్ బస్సుల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనున్నట్లు బైదు తెలిపింది. మనం నిత్యం చూసే సాధారణ బస్సులకు భిన్నంగా ఈ డ్రైవర్ రహిత బస్సులు ఉండనున్నట్లు సమాచారం. ఈ డ్రైవర్ రహిత బస్సుల్లో స్టీరింగ్ వీల్, పెడల్స్, డ్రైవర్ ఉండరు. ఇవేవి లేకుండా కేవలం అపోలో 3.0 అటానమస్ డ్రైవింగ్ ఒపెన్ ప్లాట్‌ఫామ్ టెక్నాలజీ సాయంతో ఈ బస్సులు రోడ్లపై తిరగనున్నాయి. తొలుత ఈ బస్సులు విమానాశ్రాయాలు, సందర్శనీయ ప్రాంతాల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. వాణిజ్యపరంగా పూర్తి తొలి అటానమస్ / డ్రైవర్ రహిత బస్సులుగా అపోలాంగ్ బస్సులు గుర్తింపు పొందనున్నాయి. తొలుత వీటిని బీజింగ్, షెన్జెన్, జియోగన్, వూహన్, పింగనస్ నగర రవాణా సంస్థల్లో వినియోగించనున్నట్లు సమాచారం. ఈ బస్సుల గురించి బైదు చైర్మన్, సీఈవో రాబిన్ లి బైదు బీజింగ్‌లో ఏర్పాటు చేసిన ‘క్రియేట్ 2018’ కన్సల్టింగ్ సందర్భంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రాబిన్ లి బైదు మాట్లాడుతూ.. ‘డ్రైవర్ రహిత ప్రయాణ వ్యాపారీకరణకు తొలి అడుగు 2018లోనే పడింది. పెద్ద మొత్తంలో తయారయ్యే అపోలాంగ్ బస్సుల వల్ల చైనా గొప్ప ప్రగతి సాధిస్తుంద’ని తెలిపారు. అంతేకాక తాము అందించే సాంకేతిక పరిజ్ఞానం కేవలం బస్సులకే పరిమితం కాదని తెలిపారు. ప్రస్తుతం బైదు అందించే ఒపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్ టెక్నాలజీ కోసం ఇప్పటికే దాదాపు 116 కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. వీటిలో ‘జాగ్వర్ లాండ్ రోవర్’, ‘బీవైడీ’ ప్రధానమైనవి. ‘బీవైడీ’ చైనాలోనే ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ. త్వరలోనే బీవైడీ ‘ఎల్ 3’ అటానమస్ వాహనాల తయారీని ప్రారంభించనుంది. ప్రస్తుతం బైదు తయారీ చేయనున్న అటానమస్ బస్సులు కేవలం చైనా రోడ్లకు మాత్రమే కాక వేరే దేశాలకు కూడా విస్తరింపజేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో బైదు దృష్టి సారిస్తున్న మొట్టమొదటి దేశం జపాన్. ఇప్పటికే జపాన్‌లో అటానమస్ వాహనాల తయారు చేస్తున్న, జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ అనుబంధ సంస్థ ‘ఎస్బీ డ్రైవ్’తో బైదు సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో 2019 నాటికి అపోలాంగ్ అటానమస్ మిని బస్పులను జపాన్ రోడ్ల మీదకు తీసుకు వచ్చేందుకు కింగ్‌లాంగ్, బైదు కంపెనీలు కృషి చేస్తున్నాయి. నాటికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 12.5 కోట్ల ఎలక్ట్రిక్ కార్లు రోడ్ల మీదకు రానున్నట్టు ఇటీవల ఓ సర్వే తెలిపింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో చైనా ముందు స్థానంలో ఉంది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనాల్లో సగం చైనాలోనే అమ్ముడయ్యాయి. తరువాత స్థానంలో అమెరికా ఉంది. అతి త్వరలోనే ఎలక్ట్రిక్, అటానమస్ వాహనాలు వల్ల ప్రపంచ నగరాల్లో విప్లవాత్మకమైన మార్పులు రానున్నట్లు సమాచారం. వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్, బోస్టన్ కన్పులేటింగ్ నిర్వహించిన సర్వే ప్రకారం 60 శాతం ప్రజలు అటానమస్ వాహనాల వినియోగం పట్ల సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. అంతేకాక రైడ్ షేరింగ్ సర్వీస్ కూడా చాలా వేగంగా పెరగనున్నట్లు ఈ సర్వే తెలిపింది. -
భారత్ మార్కెట్‌పై చైనా ‘బైదు’ కన్ను
జొమాటో, బుక్మైషోల్లో వాటాలపై దృష్టి న్యూఢిల్లీ: చైనాకు చెందిన ఇంటర్నెట్ సెర్చి దిగ్గజం బైదు.. తాజాగా భారత్‌లోకి ప్రవేశించడంపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం రెస్టారెంట్ సర్వీసుల సంస్థ జొమాటో, ఆన్లైన్ సినిమా టికెట్ల సేవల సంస్థ బుక్‌మైషో, ఫుడ్ రిటైలర్ బిగ్ బాస్కెట్ మొదలైన వాటిల్లో వ్యూహాత్మక వాటాలు కొనుగోలు చేయాలని యోచిస్తోంది. చిన్న పట్టణాల్లో స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఆక ర్షించే దిశగా తెలుగు, హిందీ సహా పలు భారతీయ భాషల్లో యాప్‌లతో తమ మొబోమార్కెట్ యాప్ స్టోర్‌ను విస్తరించాలని భావిస్తోంది. యాప్స్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ ప్లేస్టోర్ ఆధిపత్యం నడుస్తున్న నేపథ్యంలో స్థానిక భాషల్లో యాప్స్‌ను అందించడం ద్వారా భారత్‌లో మార్కెట్ వాటా దక్కించుకోవాలని బైదు యోచిస్తోంది. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న భారత్ తమకు వ్యూహాత్మకంగా పెద్ద మార్కెట్ అని బైదు భారత విభాగం హెడ్ టిమ్ యాంగ్ తెలిపారు. గూగుల్ అందుబాటులో ఉండని చైనా మార్కెట్లో బైదు ఆధిపత్యం కొనసాగుతోంది.