ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ 'సిట్రోయెన్' ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో కొత్త eC3 ఎలక్ట్రిక్ కారుని రూ. 11.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. ఇది లైవ్, ఫీల్ అనే రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. ఇప్పటికే కంపెనీ సిట్రోయెన్ ఈసి3 కోసం రూ. 25,000 తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.
సిట్రోయెన్ ఈసీ3 ధరలు:
- లైవ్: రూ. 11.50 లక్షలు
- ఫీల్: రూ. 12.13 లక్షలు
- ఫీల్ వైబ్ పార్క్: రూ. 12.18 లక్షలు
- ఫీల్ డ్యూయెల్ టోన్ వైబ్ పార్క్: రూ. 12.43 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)
కొత్త సిట్రోయెన్ ఈసీ3 ఎలక్ట్రిక్ 29.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి 56.2 బిహెచ్‌పి పవర్ & 143 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 6.8 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వేగవంతం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు టాప్ స్పీడ్ గంటకు 107 కిలోమీటర్లు. ఇందులో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టంతో పాటు ఎకో, స్టాండర్డ్ అనే రెండు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి.
ఈసీ3 ఎలక్ట్రిక్ కారు ఫుల్ ఛార్జ్ మీద ఏకంగా 320 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI ద్వారా ధృవీకరించబడింది. అయితే వాస్తవ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇది రెండు ఛార్జింగ్ ఆప్సన్స్ పొందుతుంది. మొదటిది 3.3kW AC ఆన్‌బోర్డ్ సెటప్. దీని ద్వారా ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి పట్టే సమయం 10.5 గంటలు. 50kW DC ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా కేవలం 57 నిముషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకుంటుంది.
సిట్రోయెన్ ఈసీ3 ఎలక్ట్రిక్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కలిగి వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్‌ప్లే 35కి పైగా ఫీచర్స్ కనెక్ట్ చేయడానికి ఉపయోగపడే MyCitroen Connect యాప్ కూడా కలిగి ఉంటుంది.
కొత్త ఈసీ3 ఎలక్ట్రిక్ కారు డిజైన్ పరంగా చూడ ముచ్చటగా ఉంది. దీని ముందు భాగంలో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, దానికి కొంచెం పైన డే టైమ్ రన్నింగ్ లైట్స్ చూడవచ్చు. ఇందులో డ్యూయెల్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
కంపెనీ ఇప్పుడు సిట్రోయెన్ ఈసీ3 బ్యాటరీ ప్యాక్ మీద కంపెనీ 7 సంవత్సరాలు లేదా 1,40,000 కిలోమీటర్ల వారంటీని, ఎలక్ట్రిక్ మోటారు మీద 5 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తుంది. ఎలక్ట్రిక్ కారు మీద 3 సంవత్సరాలు లేదా 1,25,000 కిమీ వారంటీ లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment